Begin typing your search above and press return to search.
కోఠిలో కారు ఆపిన కేటీఆర్ ఏం చేశారు?
By: Tupaki Desk | 4 Sep 2018 12:12 PM GMTమాటలతో మేజిక్ చేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. ఆయనకు తగ్గట్లే ఆయన కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. తన చేతలతో మనసుల్ని దోచేస్తుంటారు. అరచేతిలో అధికారం ఉన్నా.. ఆ డాబును.. దర్పాన్ని ప్రదర్శించకుండా సింఫుల్ గా ఉండటం.. అందరితో కలివిడిగా వ్యవహరించటం కేటీఆర్ లో కనిపిస్తుంది.
ఇదే ఆయన్ను మరింత సోషలైట్ గా మార్చటమే కాదు.. సోషల్ మీడియాలో ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య అంతకంతా పెరిగేలా చేస్తుందని చెప్పాలి. అర్థ రాత్రిళ్లు రోడ్డు మీద ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నంతనే వారికి తన కాన్వాయ్ తో సాయం చేయటం.. కష్టంలో ఉన్న వారికి చేతనైనంత సాయం చేయటం లాంటివి ఆయన తరచూ చేస్తుంటారు.
ఇక.. ఎవరైనా సమస్యల మీద ట్విట్టర్ లో పోస్టులు పెడితే వెంటనే స్పందించి.. వాటి సంగతి చూడాలని అధికారుల్ని కోరుతుంటారు. ఇలా.. ఇప్పటికే పలుమార్లు సామాన్యుడిలా వ్యవహరించే కేటీఆర్ తాజాగా కింగ్ కోఠి చౌరస్తాలో తన తీరుతో అందరి మనసుల్ని దోచేశారు. ఆయన ప్రయాణిస్తున్న కారు.. కోఠి చౌరస్తా వద్దకు రాగానే రెడ్ సిగ్నల్ పడటంతో అందరితో పాటు ఆయనా ఆగారు. బైక్ మీద వెళుతున్న బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగిని మంత్రి కేటీఆర్ ను చూసి విష్ చేశారు. అందుకు ఆయన స్పందించారు. కారు దిగి ఆమెను పలుకరించారు.
ఒక మంత్రి కారు దిగి పలుకరించటం అంటే మాటలా? వెంటనే స్పందించిన వైష్ణవి.. తాను సెల్ఫీ తీసుకోవాలని కోరగా మంత్రి కేటీఆర్ ఓకే చెప్పారు. వెంటనే.. ఆమె కేటీఆర్ తో కలిసి సెల్ఫీ దిగారు. ఇది చూసిన పలువురు కేటీఆర్ తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి కుమారుడు.. ఐటీ శాఖ మంత్రి అన్న దర్పం ప్రదర్శించకుండా కేటీఆర్ వ్యవహరించిన ఈ వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎప్పుడేం చేయాలో కేటీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో?