Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
By: Tupaki Desk | 23 April 2021 4:08 AM GMTభారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలానికి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్నిరోజులుగా రోజుకు మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే, భారీగా మరణాలు సంభవిస్తున్నాయి. సామాన్యుల నుంచి సినీ నటులు, రాజకీయ నేతలు, అధికారులు అందరూ ఈ కరోనా వైరస్ బాధితులుగా మారిపోతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు , ఐదుమంది ముఖ్యమంత్రులు కరోనా బాధితులు కాగా.. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు ,తెలంగాణ ఐటీ , పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రసుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. నాకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే కరోనా లక్షణాలు తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాను అని తెలిపారు. అలాగే గత కొన్ని రోజులుగా తనకి అతి దగ్గరగా మెలిగిన వారు కరోనా టెస్ట్ చేపించుకొని ,తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్ కు ఈనెల 19న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. సీఎం కేసీఆర్‌లో స్వల్ప లక్షణాలు కనిపించడంతో మొదట ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లు చేశారు. అందులో పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత నిర్ధారించుకునేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. అందులోనూ పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.