Begin typing your search above and press return to search.
రాహుల్ ను ట్వీట్ తో కెలికి.. కేసీఆర్ గాలి తీసిన కేటీఆర్
By: Tupaki Desk | 2 Nov 2022 4:18 AM GMTరాజకీయ అధినేతలు.. కీలక నేతలతో వచ్చే ఇబ్బందేమంటే.. ఒకసారి వారికి కాన్ఫిడెన్స్ వచ్చేసిన తర్వాత.. హద్దు ఆపు లేకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడటం.. అవసరం లేకున్నా కెలికటం లాంటి పనులు చేస్తుంటారు. తాజాగా అలాంటి పనే చేసి అడ్డంగా బుక్ కావటమే కాదు.. ఈ ఇష్యూలో సంబంధం లేని ముఖ్యమంత్రి కేసీఆర్ గాలి తీసేసిన మంత్రి కేటీఆర్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సీఎం కేసీఆర్ రాజకీయ వారసుడిగా పార్టీలో తిరుగులేని నేతగా నిలిచిన కేటీఆర్.. తన రాజకీయ ప్రత్యర్థులపై పదునైన ట్వీట్లను సంధించటం ద్వారా వారిని ఇబ్బందికి గురి చేస్తుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించిన కేటీఆర్.. తాను కెలుకుతున్నది సామాన్యమైన వ్యక్తిని కాదన్న విషయాన్ని మరిచినట్లున్నారు.
ఆత్మవిశ్వాసం ఎక్కువైన వేళ.. స్థాయిల గురించి పట్టించుకోకుండా విరుచుకుపడే ప్రయత్నం చేసి.. అడ్డంగా బుక్ అయిన పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది. అదెలానంటే.. తన దేశవ్యాప్త పాదయాత్రను భారత్ జోడో యాత్ర పేరుతో నిర్వహిస్తున్న రాహుల్.. సోమవారం సాయంత్రానికి హైదరాబాద్ మహానగర శివారుకు చేరుకోవటం తెలిసిందే.
రెండు రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలో సాగుతున్న జోడో యాత్ర.. ఈ రోజు (బుధవారం) హైదరాబాద్ నగరాన్ని దాటిపోనుంది. ఇదిలా ఉంటే.. రాహుల్ పాదయాత్రను పురస్కరించుకొని ఆయన గాలి తీసేలా ఒక ట్వీట్ పోస్టు పెట్టారు కేటీఆర్. ''అమేథీలో సొంత పార్లమెంటు సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ'' అంటూ అవసరంలేని కామెంట్ చేసి.. ఆయన్ను ఇరుకున పడే ప్రయత్నం చేశారు. రాహుల్ పై మంత్రి కేటీఆర్ విసిరిన ట్వీట్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిమ్మ తిరిగే పంచ్ ఇచ్చారు.
''కన్న కూతురునే ఎంపీగా గెలిపించుకోలేని మీరు.. డబ్బా కొట్టుకున్న జాతీయ నాయకుడి రాజకీయ జీవితం ఓటమితోనే మొదలయ్యిందన్న సంగతి గుర్తుందా?'' అంటూ ట్వీట్ చేశారు. పనిలో పనిగా ''ఎవరైనా గుర్తు చేయండ్రా బాబు'' అంటూ వ్యంగ్య వ్యాఖ్యతో పాటు.. డ్రామారావు అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసిన తీరు చూశాక.. కదిలించి కొట్టించుకున్నట్లుగా కేటీఆర్ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.
ఏదో చేద్దామని కెలితే.. మరేదో అయినట్లుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ పంచ్ అన్న మాట వినిపిస్తోంది. అవసరం లేకున్నా.. కదిలించి పెట్టుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయన్న విషయాన్ని గుర్తించాలని కోరుకుంటున్నారు. మరి.. మంత్రి కేటీఆర్ కు ఈ విషయం అర్థమవుతుందంటారా?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.