Begin typing your search above and press return to search.
గుండెపోటుతో మంత్రి కేటీఆర్ మామ మృతి..!
By: Tupaki Desk | 29 Dec 2022 5:30 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ఇంటా విషాదం చోటు చేసుకుంది. కేసీఆర్ వియ్యంకుడు.. మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథరావు(72) గుండెపోటుతో మృతిచెందారు. మంగళవారం సాయంత్రం ఆయన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
హరినాథరావుకు వైద్యులు చికిత్స చేస్తున్న క్రమంలోనే బుధవారం రాత్రి 8:30గంటలకు ఆయన మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఆయన భార్య శైలిమతో సహా పలువురు కుటుంబ సభ్యులు ఆస్పత్రికి హుటాహుటిని బయలుదేరి వెళ్లారు. ఆయన మరణవార్తలో కేటీఆర్ ఇంటా విషాదచాయలు నెలకొన్నాయి.
ఈక్రమంలోనే హరినాథరావు పార్థివ దేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లోనిస్వగృహానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు నేడు సీఎం కేసీఆర్ తన వియ్యంకుడు హరినాథరావు ఇంటికి చేరుకొని నివాళులు అర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా గతంలో పాకాల హరినాథరావు మీద కాంగ్రెస్ చీఫ్ రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. హరినాథరావు ఎస్టీ సర్టిఫికెట్ పొంది.. ఆ సర్టిఫికెట్ తో డీఎఫ్‌వోగా ఉద్యోగం పొందారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా నెలకు దాదాపు రూ. 40 వేల చొప్పున పెన్షన్ కూడా పొందుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
వెలమ సామాజిక వర్గానికి చెందిన కేటీఆర్ బంధువులు ఎస్టీ సర్టిఫికెట్ ఎలా పొందుతారని గతంలో ప్రశ్నలు లేవనెత్తడంలో అప్పట్లో సంచలనంగా మారింది. అయితే కాలక్రమంలో ఈ విషయం తర్వాత మరుగున పడిపోయింది.
కాగా కేటీఆర్ మామ మృతి విషయం తెలుసుకున్న పలువురు రాజకీయ.. సినీ ప్రముఖులు కేటీఆర్ ను పరామర్శిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో హరినాథ రావు ఇంటికి చేరుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.