Begin typing your search above and press return to search.

మాజీ సీఎంపై సంచలన ఆరోపణ చేసిన మంత్రి.. రచ్చ రచ్చే..!

By:  Tupaki Desk   |   11 Nov 2021 4:30 PM GMT
మాజీ సీఎంపై సంచలన ఆరోపణ చేసిన మంత్రి.. రచ్చ రచ్చే..!
X
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి వెడేక్కాయి. నిత్యం వివాదాలతో అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల తూటాలు పేల్చుకోవడం మహారాష్ట్రలో ఇటీవల కామన్ అయిపోయింది. అయితే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం సంచలనం రేపింది. ఆ తర్వాత ఆర్యన్ ఖాన్ బెయిల్ పై బయటికి వచ్చాడు. కాగా ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే మహారాష్ట్ర రాజకీయాలు అనుహ్య మలుపులు తిరుగుతుండం ఆసక్తిని రేపుతోంది.

డ్రగ్స్ కేసులో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈక్రమంలోనే అధికార మహావికాస్ అఘాడీ, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పట్టుబడిన నేరస్థుడితో కలిసి మాజీ సీఎం ఉన్న ఫోటోలను బయటపెట్టిన మంత్రి నవాజ్ మాలిక్ మరోసారి దేవంద్ర ఫడ్నవీస్ పై సంచలన ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ గా ఆపార్టీ నేతలు సైతం ఎదురుదాడికి దిగుతుండటం గమనార్హం.

దేవంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు సీఎంగా ఉన్న సమయంలోనే దేశంలో నోట్ల రద్దు జరిగిందని నవాజ్ మాలిక్ తెలిపారు. 2016లో పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నకిలీ నోట్లను జప్తు చేశారని తెలిపారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఒక్క కేసూ నమోదు కూడా నమోదు కాలేదని ఆయన గుర్తు చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌ కావాలనే నకిలీ నోట్ల జప్తునకు సంబంధించిన కేసును రహస్యంగా దాచిపెట్టారంటూ ఆరోపణలు గుప్పించారు.

ఆ సమయంలోనే క్రిమినల్ కేసులున్న వ్యక్తులకు సైతం ప్రభుత్వ బోర్డుల్లో ఫడ్నావీస్ నియమించారని నవాజ్ మాలిక్ దుయ్యబట్టారు. ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారిగా ఉన్న సమీర్‌ వాంఖడేనే అప్పట్లో డీఆర్‌ఐ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇమ్రాన్‌ ఆలం అనే వ్యక్తిని అరెస్ట్ చేశారని అయితే అనంతరం ఆయన సోదరుడు హజీ అరాఫత్‌ రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారని మాలిక్‌ పేర్కొనడం చర్చనీయాశంగా మారింది.

నేరారోపణలు ఉన్న వ్యక్తులకు ఫడ్నావీస్ తన హయాంలో పదవులు కట్టబెట్టడం ద్వారా రాజకీయాలను సైతం కలుషితం చేశారంటూ మాలిక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా మాలిక్ ఆరోపణలపై మాజీ మంత్రి ఆశిష్ షెలార్ స్పందించారు. ఆ సమయంలో కొందరిని ప్రభుత్వ బోర్డుల్లో నియమించడం వాస్తమేనన్నారు.అయితే వారిపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేకపోవడంతోనే నియామాకాలకు నాటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఇదిలా ఉంటే మాలిక్ మాత్రం బీజేపీ నేతలకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపెడుతానని హెచ్చరించడం ఉత్కంఠతను రేపుతోంది.