Begin typing your search above and press return to search.
మంత్రి మల్లారెడ్డి మాత్రమే కాదు.. చాలామందే ఉన్నారట
By: Tupaki Desk | 20 Dec 2022 4:44 AM GMTతెలంగాణ అధికారపక్షం బీఆర్ఎస్ లో మంత్రులకు స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరిగిపోతుందా? అంటే అవునన్న విషయం తాజాగా మంత్రి మల్లారెడ్డి విషయంలో బయటకు రావటం తెలిసిందే. నామినేటెడ్ పోస్టుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించటం.. తన మాట మాత్రమే చెల్లేలా వ్యవహరిస్తున్న ఆయన తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. తాజాగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు చెందిన శేరిలింగంపల్లి, కుకట్ పల్లి, కుత్భుల్లాపూర్, ఉప్పల్ ఎమ్మెల్యేలు భేటీ కావటం.. దీనికి సంబంధించిన వివరాలు బయటకు లీక్ కావటం ఇప్పుడు రచ్చ రచ్చగామారింది.
మాట వినకుండా ఒంటెద్దుపోకడలకు పోతున్న మంత్రి మల్లారెడ్డి విషయాన్ని ఏం చేద్దామన్న విషయంపై సమాలోచనలు చేయటానికి ఎమ్మెల్యే మైనంపల్లి ఇంట్లో హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఉదంతం బయటకు రావటం హాట్ టాపిక్ గా మారింది. ఒక్క మల్లారెడ్డి మాత్రమే కాదని.. కేసీఆర్ కేబినెట్ లోని పలువురు మంత్రుల తీరు ఇదే రీతిలో ఉందన్న మాట ఇప్పుడు చర్చగా మారింది. దీనికి తగ్గట్లే.. పలు అంశాలు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు.. ఎమ్మెల్యేలకు మధ్య పెరుగుతున్న గ్యాప్ విషయాన్ని సీరియస్ గా తీసుకోకపోవటం కూడా ఇప్పటి పరిస్థితి కారణమతెని చెబుతున్నారు.
మంత్రుల అధిపత్య పోరు అంతకంతకూ పెరిగిపోతుందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో.. తెలంగాణ అధికారపక్షంలో అలకలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. దీనికి బోలెడన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విషయాన్నే తీసుకుంటే.. ఖమ్మం జిల్లాలో గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ పదవిని అధిష్ఠానం ఒక ఎమ్మెల్యే సన్నిహితుడికి ఇవ్వగా.. ఇతర నేతలు ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కాకుండా తమ నిరసన తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఇలాంటి పనే చేశారని చెబుతున్నారు.
ఇక.. మహబూబాబాద్ జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య తరచూ బేధాభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయని చెబుతున్నారు. మంత్రిపై ఎంపీ మాలోత్ కవిత కూడా గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ఎమ్మెల్యేల్ని కలుపుకుపోకుండా ఉండే మంత్రుల జాబితాలో సబితారెడ్డి.. జగదీశ్ రెడ్డి.. గంగుల కమలాకర్.. తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
మంత్రులకు.. ఎమ్మెల్యేలకు మధ్య పెరుగుతున్న గ్యాప్ ను గుర్తించిన కేటీఆర్.. వీరి మధ్య దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నించినా.. ఫలితం రాలేదన్న మాట వినిపిస్తోంది. అప్పటికి అంతా సర్దుకున్నట్లుగా కనిపించినా.. లోతుగా చూస్తే మాత్రం ఆ గ్యాప్ అలానే ఉండిపోయిందన్న మాట వినిపిస్తోంది. ఇది అంతకంతకూ ముదురుతుందని.. దీన్ని ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిదని.. లేనిపక్షంలో మొదటికే మోసం వస్తుందన్న మాట వినిపిస్తోంది. మరి.. గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.