Begin typing your search above and press return to search.
కేసీఆర్ చెప్పాల్సిన సంచలన వార్తను మంత్రి మల్లారెడ్డి చెప్పేశారా?
By: Tupaki Desk | 28 May 2022 6:31 AM GMTత్వరలో సంచలన వార్తను చెబుతానంటూ ఊరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ చెప్పే సంచలన వార్త ఏమిటి? అన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
ఇలాంటి వేళ.. పలు వాదనలు తెర మీదకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శుక్రవారం హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్మిక సదస్సుకు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చెబుతానన్న సంచలన వార్త ఇదేనేమో అన్న భావన కలిగేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి.
వచ్చే దసరా రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పటానికి వెళుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. తాను చెప్పిన మాట.. ఏదో హడావుడిగా చెప్పిన మాటగా కాకుండా.. ఆయన మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
"దసరా రోజున వరంగల్ లోని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడతారు" అంటూ చెప్పిన వైనం చూస్తే.. కేసీఆర్ చెబుతానన్న సంచలన వార్త ఇదేనా? అన్న భావన కలుగక మానదు.
ఇక.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధునుఅమలు చేస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరారు. టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని.
ఆయన కొత్త బిచ్చగాడిలా వ్యవహరిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిందేమీ లేదన్న మంత్రి మాటను పక్కన పెడితే.. దసరా రోజున జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా కేసీఆర్ ముహుర్తాన్ని రెఢీ చేసుకున్నారన్న మాట మాత్రం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.