Begin typing your search above and press return to search.
రిలయన్స్, అదానీ పరిశ్రమలపై వైసీపీ సర్కారు క్లారిటీ
By: Tupaki Desk | 7 Nov 2019 9:02 AM GMTచంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకొచ్చింది. దేశంలోనే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఒ ప్పుకొని రెండు ప్రాజెక్టులను చేపడుతానని ఒప్పందం చేసుకున్నారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తి పరిశ్రమతోపాటు కాకినాడ సముద్ర తీరంలో సహజవాయువు వెలికితీసేందుకు రెండు పరిశ్రమల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకు వచ్చింది..
అయితే ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. చంద్రబాబు దిగిపోవడం.. జగన్ గద్దెనెక్కడంతో ఈ పరిశ్రమల ఏర్పాటులో జాప్యం జరిగింది. తాజాగా ఆ రెండు ఒప్పందాల్లో ఒకటిని రిలయన్స్ రద్దు చేసుకున్నట్టు పచ్చమీడియాలో వార్తలు వచ్చాయి.. దీన్ని బేస్ చేసుకొని వైసీపీ సర్కారును అభాసుపాలు చేసేందుకు చంద్రబాబు, ఆయన అనుంగ మీడియా కట్టుకథలు అల్లి ప్రచారం చేస్తోంది..
రిలయన్స్ సంస్థ తిరుపతి సమీపంలో ఏకంగా 15వేల కోట్లతో ఏర్పాటు చేయతలపెట్టిన ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి పరిశ్రమ ఆలోచనను విరమించుకున్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రిలయన్స్ కు కేటాయించిన తిరుపతిలోని 150 ఎకరాలను తిరిగి తీసుకునేందుకు వైసీపీ సర్కారు రెడీ అయినట్టు కట్టుకథలు రాస్తున్నారు.
అయితే ఇదంతా అబ్ధమని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని దినపత్రికలలో అదాని, రిలయన్స్ సంస్థలు వెనక్కి వెళుతున్నాయంటూ వచ్చిన వార్తల ప్రచారం వాస్తవం కాదని మేకపాటి వివరణ ఇచ్చారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పారదర్శకత, నిజాయతీ, జవాబుదారీతనానికి కట్టుబడి ముందుకెళుతున్నామని వివరించారు. రిలయన్స్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించిన భూములు కోర్టు కేసులో ఉన్నందున ఏపీఐఐసీ ద్వారా ప్రత్యామ్నాయ భూములు కేటాయించనున్నామని తెలిపారు. అందుకే రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటులో కోర్టు కేసుల వల్లే జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి ‘అదానీ’ ప్రతినిధులతో చర్చిస్తున్నామని ఏపీ నుంచి ఏ ఒక్క పరిశ్రమ తరిలిపోవడం లేదని క్లారిటీ ఇచ్చారు.
చంద్రబాబు హయాంలో వెనుకా ముందు చూసుకోకుండా రిలయన్స్ కు తిరుపతిలో రైతులు సాగు చేసుకుంటున్న 150 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో 15మంది రైతులు కోర్టుకెక్కి స్టే తెచ్చారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రిలయన్స్ ను కోరి 75 ఎకరాలను అప్పగించింది. అయినా రిలయన్స్ నుంచి స్పందన లేదట.. రిలయన్స్ పరిశ్రమ ఏర్పాటు నుంచి వైదొలగిందని.. ఎంత ప్రయత్నించినా వాళ్లు ఆసక్తి చూపించడం లేదని పచ్చమీడియా కట్టుకథలు ప్రచారం చేస్తోంది. వాస్తవానికి కోర్టు కేసుల కారణంగా రిలయన్స్ సంస్థ ఈ పరిశ్రమ ఏర్పాటు చేయలేకపోతోంది. వైసీపీ సర్కారు ఇప్పుడు రిలయన్స్ కు ప్రత్యామ్మాయ భూమి ఇచ్చేందుకు రెడీ కావడంతో పచ్చమీడియా కథనాలకు చెక్ పడినట్టైంది. దాదాపు 15వేల కోట్ల విలువైన పరిశ్రమ ఏపీలో మొదలైతే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.