Begin typing your search above and press return to search.
రాసలీలల మంత్రి నుంచి ఆమెకు ప్రాణభయం
By: Tupaki Desk | 21 Dec 2016 7:16 AM GMTఓ పని గురించి తన వద్దకు వచ్చిన విజయలక్ష్మి అనే మహిళపై కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి మేటి రాసలీలలు జరిపిన వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాసలీలలు బహిరంగమైనప్పటి నుంచి బాధితురాలు విజయలక్ష్మి అజ్ఞాతంలోనే గడుపుతోంది. తాజాగా మాజీ మంత్రి మేటి నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ బాగల్ కోటెలోని పోలీస్ స్టేషన్ లో ఆమె పిర్యాదు చేయడం కలకలం సృష్టిస్తోంది.
పోలీసులను ఆశ్రయించిన విజయలక్ష్మీ నలుగురు వ్యక్తులు తనను బెదరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. డీఏఆర్ కానిస్టేబుల్ సుభాష్ - మారుతి మీరజ్కర్ - అశోక్ లాగలోటె - సిద్దలింగ అబలగట్టి తనను బెదరిస్తున్నారని ఆరోపించింది. మరో వైపు, ఈ వీడియో సీడీని విడుదల చేసిన ఆర్టీఐ కార్యకర్త రాజశేఖర్ కూడా మేటి అనుచరుల నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ బళ్లారిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎఫ్ ఐఆర్ కూడా నమోదైంది.
కాగా..కర్ణాటక ప్రభుత్వ పరిపాలన కేంద్రమైన వికాస సౌధలో తన అధికార చాంబర్ కు ఎదురుగా ఉన్న గదిలో మంత్రి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచార హక్కు ఉద్యమవేత్త రాజశేఖర్ ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి తనకు లభించినట్లుగా అతను ప్రకటించగా...బాధిత మహిళ ఈ ఆరోపణలను ఖండించారు. మేటి తనకు తండ్రి లాంటి వాడని, ఇదంతా కుట్రని - సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు బయటపెడతానని మీడియాతో పేర్కొంది. కానీ రాజశేఖర్ మాత్రం ఇదంతా నిజమని పేర్కొంటూ మంత్రి మద్దతుదారులు తనపై దాడి చేసే అవకాశముందని, తనకు రక్షణ కల్పించాలని రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఇప్పటికే అతనికి రక్షణ కల్పించారు. అనంతరం ఆమె ఇపుడు ఫిర్యాదు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/