Begin typing your search above and press return to search.
లోకేశ్ కు బుద్ధి రాకపోవడానికి చంద్రబాబే కారణమట!
By: Tupaki Desk | 22 Oct 2019 6:22 AM GMTఆంధ్రప్రదేశ్ మంత్రి మోపిదేవి వెంకట రమణ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు - ఆయన కుమారుడు లోకేశ్ లపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. లోకేశ్ కు బుద్ధి లేకపోవడానికి కారణం ఆయన చంద్రబాబు కుమారుడు కావడమేనని అన్నారు. చంద్రబాబు కూడా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దాడి చేస్తూ తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని దిగజార్చుకుంటున్నారని ఆరోపించారు.
మొన్నటి ఎన్నికల తరువాత చంద్రబాబు మానసిక స్థితి దెబ్బతిందని.. ఎన్నికలలో అవమానకరమైన ఓటమి చంద్రబాబు నాయుడులో అభ్రదతా భావాన్ని సృష్టించిందని.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పరంపరను చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని మోపిదేవి అన్నారు.
“ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన విమర్శలలో ఎటువంటి విషయం లేదు. ఆయన చౌకబారు రాజకీయాలు చేస్తున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దాడి చేస్తున్నాడు. తద్వారా తన సొంత ఇమేజ్ ను తగ్గించుకుంటున్నాడు ”అని మంత్రి మోపిదేవి ఫైర్ అయ్యారు. “చంద్రబాబు నాయుడు నోరుజారుతూ తనకున్న వ్యక్తిగత ప్రతిష్టను కూడా కోల్పోతున్నాడు. ఇక ఆయన కుమారుడు లోకేష్ బుద్ధిహీనంగా ప్రవర్తించటానికి కారణం చంద్రబాబు వైఖరే కావచ్చు” అని మోపిదేవి అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడంలో కొంత కసరత్తు చేసి మాట్లాడాలని టిడిపి నాయకులకు సలహా ఇచ్చారు.