Begin typing your search above and press return to search.
సీఎం యోగికి ఆ మంత్రి బర్త్ డే స్పెషల్ గిఫ్ట్!
By: Tupaki Desk | 7 Jun 2018 4:49 AM GMTఉప ఎన్నికల్లో షాకింగ్ పరాజయం తర్వాత నిర్వహించే క్యాబినెట్ సమావేశం ఎలా ఉంటుంది? హాట్ హాట్ గా సాగటంతో పాటు.. అధిష్ఠానం దెబ్బకు యమా సీరియస్ గా సాగుతుందనుకోవటం కామన్. కానీ.. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ మాత్రం అందుకు భిన్నంగా జరిగిందని చెబుతున్నారు.
ఇటీవల వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి దిమ్మ తిరిగేలా చేయటం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా భావించినప్పటికీ గెలుపు సాధ్యం కాకపోవటంతో బీజేపీ వర్గాలు ఢీలా పడ్డాయి. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్వహించిన యోగి మంత్రివర్గ సమావేశం ఉల్లాసంగా జరిగినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి యోగికి మంట పుట్టేలా బీజేపీలోని అసంతృప్తి వర్గం వ్యవహరిస్తుందన్న వార్తలకు భిన్నంగా.. క్యాబినెట్ మీటింగ్ ఉల్లాసంగా సాగినట్లుగా చెబుతున్నారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. సీఎంకు పలువురు బర్త్ డే విషెస్ చెప్పారు. ముఖ్యమంత్రి మీద తమకున్న అభిమానాన్ని ప్రదర్శిస్తూ పలువురు మంత్రులు పూలు.. పండ్లు తీసుకొచ్చి బహుమతిగా ఇచ్చారు.
ఈ సందర్భంగా మరో మంత్రి ముకుట్ బిహారీ వర్మ మాత్రం సీఎం కోసం తాను ప్రత్యేకమైన కానుకను తెచ్చినట్లుగా చెప్పటంతో.. అందరూ ఆయన తెచ్చిన బహుమతి ఏమిటన్న ఆసక్తితో చూశారు. ఆయన తాను తెచ్చిన పాకెట్‌ను విప్పదీసి.. అందులో నుంచి మురళి (పిల్లనగ్రోవి)ని తీసి ఇచ్చారు. బర్త్ డే సందర్భంగా తన కానుక ఇదేనంటూ మురళిని సీఎం యోగి చేతికి ఇచ్చారు.
ఆ బహుమతిని నవ్వుతూ తీసుకున్నారు యోగి. అంతలో మరో మంత్రి కలుగజేసుకొని ఇప్పుడు అందరూ మురళిని వినిపించాలా? అంటూ వ్యాఖ్యానించినంతనే.. అంతా పెద్ద పెట్టున నవ్వారు. అనంతరం మంత్రి ముకుట్ అందరికి తాను చెప్పిన పాకెట్లను పంచారు. అందరికి మురళిని ఆయన బహుమతిగా ఇచ్చారు. ఇంతకూ ఈ మంత్రిగారికి.. మురళికి ఉన్న సంబంధం ఏమిటన్న సందేహం రాక మానదు. ఆయన ప్రాతినిధ్యం వహించే పీలీభీత్ జిల్లా వేణువులకు ప్రసిద్ధి. దేశ వ్యాప్తంగా అత్యుత్తమ వేణువుల్ని తయారు చేయటంలో మంచి పేరుంది. ఈ కారణంతో పిల్లనగ్రోవిలను తీసుకొచ్చిన మంత్రి పుణ్యమా అని మంత్రివర్గ సమావేశం మొత్తం నవ్వులతో నిండిందంటున్నారు.