Begin typing your search above and press return to search.
లోకేశ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
By: Tupaki Desk | 13 April 2018 11:33 AM GMTఅదేం చిత్రమో కానీ.. సరిగ్గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఊళ్లో లేనప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు చినబాబుతో భేటీ కావాల్సిన అవసరం వచ్చి పడింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఏదైనా ముఖ్యమైన అంశం మీదనైతే.. ఉరుకులు పరుగులు పెట్టి మరీ భేటీ కావటంలో అర్థముంది.
చంద్రబాబు కుమారుడు కమ్ ఏపీ మంత్రిగా వ్యవహరిస్తున్న లోకేశ్ ను తాజాగా టాలీవుడ్ నిర్మాతలు పలువురు భేటీ అయ్యారు. ఓపక్క హోదా మీద పెద్ద ఎత్తున రాజకీయ ప్రక్రియ జరుగుతున్న వేళ.. టాలీవుడ్ నిర్మాతలు ఈ అంశంపై మాట్లాడతారేమోనన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే.. అవన్నీ తప్పుగా తేలుస్తూ.. చినబాబుతో భేటీ అయ్యింది ఫైబర్ గ్రిడ్ కంటెంట్ డెవలప్ మెంట్ కోసమని వెల్లడించారు.
కంటెంట్ అభివృద్ధిలో భాగంగా ఒప్పందం చేసుకున్నామని.. థియేటర్లలో విడుదలకు నోచుకోని చిన్న సినిమాలు.. షార్ట్ ఫిలింస్.. కేబుల్ టీవీల్లో ప్రసారమయ్యేలా చర్యలు తీసుకోవటం చేస్తామని ప్రకటించారు. సినిమా టికెట్స్ ను బుక్ చేసుకునే అవకాశం లాంటి సేవల్ని ఒప్పందం ద్వారా ప్రజలకు అందిస్తామని చెప్పారు. తమ అవసరం కోసమే లోకేశ్ ను కలిసినట్లు ఉండకుండా ఉండేలా మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ది.. స్టూడియోల నిర్మాణం.. ఫిలింనగర్ లాంటి వాతావరణం ఏర్పాటుకు పక్కా ప్రణాళికతో తాము మరోసారి వస్తున్నట్లు చెప్పారు. అదేదో.. ఇప్పుడే రాకుండా.. అన్నిఅంశాలపై క్లారిటీ తెచ్చేసుకొని ఒక ప్రకటన చేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా.. అందరూ అనుకున్నట్లుగా ప్రకటన చేయటానికి వారేమైనా సాదాసీదా వ్యక్తులా.. టాలీవుడ్ ను శాసిస్తున్న నిర్మాతలుగా చెప్పక తప్పదు. లోకేశ్ ను కలిసిన నిర్మాతల్లో కేఎస్ రామారావు.. దిల్ రాజు.. ఠాగూర్ మధు తదితరులు ఉన్నారు. ఇలాంటివారంతా బయలుదేరాక దేని కోసమో ఆగటం లాంటివి ఉంటాయంటారా?