Begin typing your search above and press return to search.
ఏపీ ఉద్యోగుల అమరావతి ‘జర్నీ’ డేట్ ఫిక్స్?
By: Tupaki Desk | 4 May 2016 10:39 AM GMTరాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులు ఏపీ రాజధాని అమరావతికి తరలి వెళ్లాల్సిన సమయం దగ్గరకు వచ్చేసినట్లే. ఓపక్క అమరావతిలో శరవేగంగా నిర్మిస్తున్న ఏపీ సచివాలయ భవన పనుల్ని ఎట్టి పరిస్థితుల్లో జూన్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఏపీ సర్కారు ఉంది. ఇదిలా ఉంటే తాజాగా మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్లాల్సిన సమయం గురించి ఆయన చెప్పకనే చెప్పేశారు.
జూన్ 27లోపు ఏపీ సచివాలయ ఉద్యోగుల్ని అమరావతికి తరలించనున్నట్లు స్పష్టం చేశారు. అంటే.. జూన్ మూడో వారంలో హైదరాబాద్ లో ఉన్న ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతి ప్రయాణం కట్టే అవకాశం ఉందన్న మాట. జూన్ 27 లోపు అని డెడ్ లైన్ పెట్టుకున్న నేపథ్యంలో ఈ లోపలే ఉద్యోగులు తరలివెళ్లటం ఖాయమని చెప్పాలి.
అయితే.. ఉద్యోగులు వెళ్లే సమయానికి సచివాలయ నిర్మాణం మొత్తంగా పూర్తి కాదని.. అయినప్పటికీ.. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా నిర్మాణ పనుల్ని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. నారాయణ మాటల్ని చూస్తుంటే.. జూన్ మూడో వారంలో ఏపీ సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లాల్సి ఉంటుందన్న మాట.