Begin typing your search above and press return to search.
కోర్టుకు షారుఖ్ కొడుకు.. సారీ చెప్పిన నవాబ్ మాలిక్
By: Tupaki Desk | 11 Dec 2021 4:14 AM GMTబాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసు కు సంబంధించిన విచారణలు, వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కోర్టు మెట్లు మరోసారి ఎక్కారు. అదే సమయంలో ఆర్యన్ కు సపోర్టుగా ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేను టార్గెట్ చేసిన మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కోర్టుకు సారీ చెప్పాడు. ఈ రెండు పరిణామాలు తాజాగా చోటుచేసుకున్నాయి.
మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత నవాబ్ మాలిక్ బాంబే హైకోర్టుకు శుక్రవారం క్షమాపణలు చెప్పారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారి సమీర్ వాంఖడే, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని తాను హామీ ఇచ్చినప్పటికి బహిరంగంగా విమర్శలు చేసినందుకు గాను ఈ క్షమాపణ చెప్పారు.
ఈ మేరకు నవాబ్ మాలిక్ తరుఫున న్యాయవాది అస్పీ చినోయ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. నవంబర్ 29న కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు క్షమాపణ చెబుతున్నట్లు మాలిక్ పేర్కొన్నారు. కోర్టును అగౌరపరచడం తన ఉద్దేశం కాదన్నారు.వాంఖడేపై తన క్లయింట్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వాదించారు. మాలిక్ క్షమాపణలను హైకోర్టు అంగీకరించింది.
మాలిక్ తన కుమారుడు సమీర్ వాంఖడేపై విమర్శలు చేస్తున్నారని ఆయన తండ్రి హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీంతో వాంఖడే కుటుంబంపై విమర్శలు చేయనంటూ మాలిక్ హామీ ఇచ్చారు. కానీ ఓ ఇంటర్వ్యూలో మరోసారి నోరుజారారు.
-హైకోర్టును ఆశ్రయించిన షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ షరతులను సవరించాలని కోరుతూ బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎన్సీబీ ముందు హాజరు కావాలన్న షరతును సవరించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు.
ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారి మీడియా నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిటీషన్ లో పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేసినందున తన బెయిల్ షరతులను సడలించాలని అబ్యర్థించాడు. డిసెంబర్ 13న ఈ పిటీషన్ విచారించనున్నారు.
ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ కేసులో పట్టుబడి దాదాపు 27 రోజులు జైల్లో ఉన్నాడు ఆర్యన్. ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. కండీషన్ బెయిల్ నేపథ్యంలోనే ఆర్యన్ మరోసారి ఎన్సీబీ కార్యాలయానికి రావాల్సి వచ్చింది.
ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముందు హాజరు కావాలని ఆర్యన్ ఖాన్ కు షరతులు విధిస్తూ ముంబై హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అంతేకాకుండా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్యన్ ఖాన్ ఈరోజు ఎన్సీబీ ఎదుట హాజరవుతున్నాడు.