Begin typing your search above and press return to search.
కేంద్రం ఇప్పటికీ ఒక్క హామీ నేరవేర్చలేదు: ఢిల్లీ ప్రెస్ మీట్ లో మంత్రినిరంజన్ రెడ్డి
By: Tupaki Desk | 20 Dec 2021 8:05 AM GMTకేంద్రం ధాన్యం కొనుగోలు చేస్తామనని లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసేందుకు శనివారం మంత్రులు, ఎంపీల బృందం ఢిల్లీ వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..
‘కేంద్ర ప్రభుత్వం ఈ వానకాలానికి సంబంధించి తెలంగాణ నుంచి 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చేసేందుకు 60 లక్షల ధాన్యాన్ని టార్గెట్ ఇచ్చారు. అయితే గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ పెంచమని కోరారు. తెలంగాణలో 63 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, ఈ భూముల ద్వారా కోటి 30 లక్సల టన్నుల ధాన్యం ఉత్పతి అవుతుంది.
అందువల్ల టార్గెట్ పెంచాలని కోరాం. అయితే ఆ తరువాత కొనుగోళ్లు ప్రారంభమయ్యాక చూద్దామని అన్నారు. ఆ తరువాత ధాన్యాన్ని కొంటామని పార్లమెంట్ లోప్రకటించారు.
‘అయితే నోటి మాట ద్వారా కాకుండా లిఖిత పూర్వక హామీ ఇవ్వాలి. వారిచ్చిన టార్గెట్ నేటితో పూర్తవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా 6,952 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరించాం.
ఇప్పటికే పూర్తయినవి మూసేశాం. ఇంకొన్ని కొనుగోలు కేంద్రాల్లో 15 లక్షల మెట్రికట్ టన్నుల ధాన్యం ఉంది. అయితే కొనుగోళ్లలో కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకంటే రైతులు హార్వెస్టర్ల ద్వారా తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు కేంద్రాల్లో ఉంచడం వల్ల ధాన్యంలో తేమ శాతం ఉంటుంది. అందువల్ల రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కనిపిస్తూ ఉంటుంది.’
‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి కాబోతుంది. ఇంకా భూపాలపల్లి జిల్లా, నల్గొండలోని కొన్ని జిల్లాల్లో వరి రైతులు ఇప్పుడే వరి కోస్తున్నారు. అందువల్ల ఆ ధాన్యం కూడా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం నోటి మాట ద్వారా కాకుండా లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరుతున్నాం. నిన్న కిషన్ రెడ్డి మాట్లడుతూ రా రైస్ ఎంతొచ్చినా కేంద్ర కొంటామని చెబుతుందిగా అని అంటున్నారు.
అసలు విషయమేంటంటే.. ధాన్యం కొనుగోళ్లు చేసిన తరువాత ప్రభుత్వం రైతుల అకౌంట్లలోడబ్బులు వేయాలి. ఇవి ఎక్కడి నుంచి తేవాలి..?ఇప్పటి వరకు కేంద్ర తెలంగాణకు ఇచ్చిన ఏ హామిని నిలబెట్టుకోలేదు. అందువల్ల నోటి మాట ద్వారా కాకుండా వచ్చే సీజన్లలో వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని బహిరంగంగా రాత పూర్వకంగా హామీ ఇవ్వాలి’ అని మంత్రి నిరంజన్ అన్నారు.