Begin typing your search above and press return to search.
పవన్ని ఓడించిన గ్రంధికి నోట మాట రాకుండా చేసిన కేంద్ర మంత్రి
By: Tupaki Desk | 28 Oct 2022 12:30 AM GMTఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ణి ఓడించి తెలుగు రాష్ట్రాలలో పొలిటికల్ గా ఫుల్ ఫ్యామస్ అయ్యారు. ఆయనే భీమవరం వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. ఆయన పదవీకాలం మూడున్నరేళ్ళు దాటింది కానీ నియోజకవర్గంలో చేయాల్సిన చాలా పనులు మాత్రం అలాగే ఉన్నాయి. దాంతో ఆయన్ని విమర్శించినది సామాన్యులు ఎవరో కాదు ఏకంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆమె పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో తాజాగా పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడుతూ తాను ఏపీ నుంచి ఎంపీగా ఉన్నపుడు 2016లో భీమవరం చుట్టుపక్కన గ్రామల కోసం ప్లాంట్ నిర్మాణం ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేశానని గతాన్ని చెప్పుకొచ్చారు. ఆ ప్లాంట్ నిర్మాణం కనుక అయితే ఆరు గ్రామాల ప్రజలకు పూర్తి ప్రయోజనం దక్కేదని కానీ నేటికీ దానికి అతీ గతీ లేకుండా అలాగే పడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ఎందుకు ప్లాంట్ పూర్తి కాలేదో మీ స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ని ప్రశ్నించి నిలదీయాలని కేంద్ర మంత్రి చెప్పడంతో గ్రంధికి నోట మాటరాలేదు. ఆయన షాక్ తిన్నట్లు అయ్యారు. పక్కన ఉన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ సమక్షంలో చెబుతున్నాను మీ ఎమ్మెల్యే వెంటపడి ప్లాంట్ నిర్మాణం చేయించుకోండి అని నిర్మలా సీతారామన్ చెప్పడం విశేషం.
అయితే వెంటనే తీరుకున్న గ్రంధి మీరు కూడా ఉన్నారు కదా అని ఏదో చెప్పబోతుండగా నేను ఎందుకు మీ మనుషులు సరిపోరా అని ఎదురు ప్రశ్న వేయడంతో ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారని అంటున్నారు. మొత్తానికి ఇది చూస్తే కనుక భీమవరం ఎమ్మెల్యే పనితీరుని కేంద్ర మంత్రి హోదాలో నిర్మల గట్టిగా ఎండగట్టారనే అంటున్నారు. నిధులు పూర్తిగా మంజూరు అయిన ప్లాంట్ విషయంలో కూడా పరిపూర్తికి ఎమ్మెల్యే పనిచేయలేదని ఆమె ఏకంగా జనాల ముందే చెప్పి ఆయనని ఇరకాటంలో పెట్టారని అంటున్నారు.
ఇదిపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో గ్రంధిని కేంద్ర మంత్రి చిన్నబుచ్చారు అని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ని ఓడించి భీమవరానికి మేలు చేస్తారనుకుంటే ఆయన పనితీరులోని డొల్లతనం ఇదా అని కూడా మరికొందరు నెటిజన్లు అంటున్నారుట. మొత్తానికి నిర్మలమ్మ సాఫ్ట్ గానే ఉంటూ గ్రంధికి హార్డ్ గా షాక్ ఇచ్చారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.