Begin typing your search above and press return to search.
రాష్ట్రంలో ఆర్టీసీకి ఉన్న బస్సులు ఎన్నో మంత్రికి తెలీదా?
By: Tupaki Desk | 18 Oct 2021 5:02 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు. అన్నింటికి మించిన ఏదైనా అంశంలో ప్రావీణ్యం ఉందన్న మాట నోటి నుంచి వస్తే.. ఇక అంతే సంగతులు అన్నట్లుగా ఉంటుందని చెబుతారు. కాసింత మాట్లాడటంతోనే అవతలి వారిలో విషయం ఎంతన్న విషయాన్ని పట్టేసే ఆయన.. ఏదైనా అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు.. అధికారులు సైతం ఆశ్చర్యపోయేలా ఆయన వద్ద కంటెంట్ ఉంటుందని చెబుతారు.
అలాంటి ముఖ్యమంత్రి రివ్యూ చేసే వేళలో.. అటు మంత్రులు కానీ ఇటు అధికారులు కానీ ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే.. ఆయన నోటి నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రశ్న వస్తుందో తెలీదు. ఒకటికి రెండుసార్లు తెలీదన్న సమాధానం నోటి నుంచి వస్తే.. ఆయన స్పందించే తీరు మారుతుందని చెబుతారు. అందుకే.. ఆయనతో మాట్లాడే వేళలో జాగ్రత్తగా ఉండాలి. పక్కా సమాచారంతో ఉండాలి.
తాజాగా అలాంటి సమాచారం లేక ఇబ్బందికి గురయ్యారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రవాణా శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న ఆయనకు.. తెలంగాణలో ఆర్టీసిక ఎన్ని బస్సులు ఉన్నాయన్న ప్రశ్నను పువ్వాడ అజయ్ నేరుగా సమాధానం చెప్పలేకపోయారు. ఈ నెలాఖరులో విజయ గర్జన సభకు జిల్లాల వారీగా జనాల్ని బస్సుల్లో తరలించాలన్న నిర్ణయానికి వచ్చిన వేళ.. ఆయనకు రాష్ట్రంలో ఉన్న బస్సులు సంఖ్య ఎంతన్నది ప్రశ్నగా మారింది.
అయితే.. జిల్లాల వారీగా ఎవరికెన్ని బస్సులు కావాలో చెబితే.. తాను ఏర్పాటు చేస్తానని చెప్పిన అజయ్.. సమావేశం మధ్యలో బయటకు వెళ్లి.. రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సులు ఎన్ని.. జిల్లాల వారీగా ఎన్ని బస్సులు ఉన్నాయన్న సమాచారాన్ని సేకరించే ప్రయత్నంలో మునిగారు. ఇదే సమయంలో సమావేశ మందిరం నుంచి ముఖ్యమంత్రి నుంచి పిలుపు రావటంతో ఆయన లోపలకు వెళ్లారు. పువ్వాడ లోపలకు వెళ్లినంతనే.. బస్సుల లెక్క చెప్పలేవా? అంటూ సెటైర్ పడటంతో.. తాను రవాణా శాఖా మంత్రినని.. నిర్వహణ వ్యవహారాల్ని ఆర్టీసీ ఎండీ చూస్తారని చెప్పినా.. ఆయన సమాధానం అతికినట్లుగా లేదన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి పువ్వాడ వారికి.. బస్సుల లెక్క విషయంలో గాలి పోయిందన్న మాట వినిపిస్తోంది.