Begin typing your search above and press return to search.
అభినందనలు; శభాష్ పద్మారావ్
By: Tupaki Desk | 17 March 2015 4:43 AM GMTమంచిని మంచిగా చెప్పుకోవాలి. చెడ్డను చెడ్డగా చెప్పటానికి ఏమాత్రం త్రోటుపాటుకు గురి కాకూడదు. నిజం చెప్పే విషయంలో ఎలాంటి రాగద్వేషాలకు.. ఈగోలకు పోకుండా ఉండటం ఉత్తమం. కానీ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నచ్చిన వారిని తప్పించి ఎవరిని మెచ్చుకోని దుస్థితి తెలుగు రాజకీయాల్లో ఉంది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన సుదీర్ఘ ఉద్యమంలో కేసీఆర్‌కు మొదటి నుంచి ఆయన వెంట నేతల్లో సికింద్రాబాద్‌కు చెందిన టి పద్మారావు ఒకరు. టీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత విధేయుడైన ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టిన కేసీఆర్ ఆయన కష్టానికి తగ్గ ఫలితం ఇచ్చారు.
మరి.. మంత్రి హోదాలో ఉన్న వారి వద్దకు నిత్యం రకరకాల పైరవీల కోసం ఆయన వద్దకు వస్తుంటారు. అలా వచ్చిన వారి కోరికల్ని తీర్చేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎందుకుంటే.. మంత్రి స్థాయి వ్యక్తి దగ్గరకు పైరవీ కోసం వెళ్లటం అంత చిన్న విషయం కాదు కదా. తాజాగా అలానే ఆయన వద్దకు ఒక పైరవీ వచ్చింది.
ఒక మద్యం వ్యాపారిని ఎమ్మెల్యే గొంగిడి సునీత వెంటబెట్టుకొచ్చారు. యాదగిరిగుట్టకు చెందిన సదరు వ్యాపారి.. తన షాపును మూసివేశారని.. తిరిగి తెరిపించాలని కోరారు. దీంతో అప్పటివరకూ మామూలుగానే ఉన్న పద్మారావు ఒక్కసారి ఫైరయ్యారు. పన్నులు కట్టకుండా ఉన్నందుకే దుకాణాన్ని బంద్ చేశారని.. అయినా ఒక మద్యం సిండికేట్ నడిపే వ్యక్తిని తన వద్దకు తీసుకొస్తారా అంటూ వెంట తెచ్చిన ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. మంత్రికి మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగిందని చెబుతున్నారు. పన్నులు కట్టనందుకే దుకాణం బంద్ చేశారని.. తన వద్దకే కాదు.. ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లినా షాపు తెరవమని చెప్పరంటూ తేల్చేశారు. పైరవీ కోసం వచ్చిన వారిని పట్టుకొని కడిగిపారేయటమే కాకుండా.. ఇలాంటి పైరవీలు తన దగ్గరకు తీసుకొస్తే బాగోదని తేల్చి చెప్పిన పద్మారావు.. సమకాలీన రాజకీయాల్లో కాస్త భిన్నమైన వ్యక్తిగా చెప్పక తప్పదు.