Begin typing your search above and press return to search.

మంత్రి పద్మారావుకు కొడుకు ప్రేమ షాక్

By:  Tupaki Desk   |   3 Nov 2015 7:38 AM GMT


మరో ప్రముఖుల ఇంటి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన పద్మారావు ఇంట ప్రేమ వివాహం జరిగినట్లు చెబుతున్నారు. నిజానికి రెండు రోజుల క్రితమే ఈ మ్యారేజ్ జరిగినా గుట్టుగా ఉంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు చెబుతున్నారు. పద్మారావు కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించి.. రెండు రోజుల క్రితం పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నారు.

మంత్రిగారి ఇంటికి దగ్గర్లోనే సదరు యువతి ఇల్లు అని.. వారిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. తమ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాకపోవటంతో మంత్రి పద్మారావు ఇంట్లో ఈ ప్రేమకు నో చెప్పినట్లుగా చెబుతున్నారు. అయితే.. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే విషయంలో మంత్రిగారి అబ్బాయి పట్టుదలతో ఉండి.. తాను అనుకున్నది పూర్తి చేశాడని చెబుతున్నారు.

ఇంట్లో తెలీకుండా కొడుకు పెళ్లి చేసుకోవటంతో.. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా మంత్రి ఫ్యామిలీ మెంబర్స్ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అబ్బాయిగారి పెళ్లి వ్యవహారం మంత్రిగారింట్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ ప్రేమ.. పెళ్లి వ్యవహారం అధికారికంగా ఎప్పటికి బయటకు వస్తుందో..?