Begin typing your search above and press return to search.
ఏపీలో టీ మంత్రి కారు హడావుడి
By: Tupaki Desk | 6 Sep 2015 5:01 AM GMTచేతిలో అధికారం ఉండాలే కానీ.. రాష్ట్రం ఏదైతేనేం అన్న విషయాన్ని నిరూపించారో తెలంగాణ రాష్ట్ర మంత్రి తనయుడు. తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన నాటి నుంచి ఒక రాష్ట్రానికి చెందిన నేతలు.. వారి కుటుంబ సభ్యులు మరో రాష్టానికి వెళ్లినప్పుడు కాస్త ఆచితూచి ఉండటం తెలిసిందే.
దీనికి భిన్నంగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి పద్మారావు కుమారుడన్న పేరుతో మంత్రిగారు వాడే బుగ్గకారు వేసుకొని వచ్చి హడావుడి చేయటం చర్చనీయాంశంగా మారింది.
కర్నూలు జిల్లా మహానందికి బ్లూ కలర్ బుగ్గకారు వేసుకొని వచ్చిన వ్యక్తి.. తన వాహనాన్ని నేరుగా ఆలయ ముఖద్వారం వరకూ తీసుకొచ్చారు. ఆలయం ముందు వరకు కారులోనే వెళ్లాలన్న వైఖరిని గుర్తించి.. కారును ఆపేసిన భద్రతా సిబ్బంది.. వాహనంలోని వ్యక్తి వివరాలు అడిగారు.
తాను తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు కుమారుడినని.. తన మిత్రులతో కలిసి కారులో వచ్చానని లోపలకు పంపాలని కోరారు. నిబంధనల ప్రకారం లోపలికి కారును అనుమతించటానికి కుదరదని.. కారును తిరు మండపానికి దగ్గర్లో పార్క్ చేసుకొని లోపలికి వెళ్లాలని సూచన చేశారు. ఈ సందర్భంగ కాసింత హడావుడి చోటు చేసుకోవటం జరిగిందని చెబుతున్నారు.
రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి హడావుడి చేయటం విడ్డూరమన్న మాటతో పాటు.. ఎంత మంత్రి కొడుకు అయితే మాత్రం.. మంత్రిగారికి అధికారికంగా ఇచ్చిన కారును.. స్నేహితుల్ని వేసుకొని ఇలా వాడేస్తారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పవర్ చేతిలో ఉన్నప్పుడు ఇలాంటివి గుర్తు ఉంటాయా ఏంటి..?