Begin typing your search above and press return to search.
చంద్రబాబూ.. పెట్రోల్‌పై.. ఢిల్లీలో పోరాడు.. నేనూ వస్తా.. మంత్రి పేర్ని సవాల్
By: Tupaki Desk | 8 Nov 2021 2:30 PM GMTటీడీపీ అదినేత చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ నేతలపై వైసీపీ నాయకుడు, మంత్రి పేర్ని నాని.. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గించాలని.. అటు టీడీపీ, ఇటు బీజేపీ నేతలు.. డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పేర్ని.. ఈ రెండు పార్టీల నేతలపై కారాలు మిరియాలు నూరారు. దమ్ముంటే.. ఢిల్లీలో పోరాటం చేయాలని.. తాను కూడా వచ్చి ధర్నాలో పాల్గొంటానని సవాల్ విసిరారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలతోనే పెట్రోల్, డీజిల్ , వంట గ్యాస్ ధరలు మండిపోతున్నాయని.. సామాన్యుడి జేబు గుల్ల అవుతోందని.. ఆయన చెప్పారు. అంతేకాదు.. చంద్రబాబు హయాంలోనే వ్యాట్‌ను భారీగా పెంచారని.. పేర్ని విమర్శలు గుప్పించారు.
రాకెట్ కంటే వేగంగా.. పెంపు
రాకెట్ కంటే వేగంగా పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్రం పెంచుతోందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారు. ``రూ.70 పెట్రోల్‌ను రూ.110కి తీసుకెళ్లారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నార``ని మంత్రి మండిపడ్డారు. అక్టోబర్‌లో ధర ఎంత ఉంది? నవంబర్‌లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోడీని డిమాండ్ చేయాలి. సెస్ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసింది. బీజేపీ నేతలు ధర్నా చేస్తే నేను కూడా ఢిల్లీ వస్తా. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచింది. అని పేర్ని వ్యాఖ్యానించారు.
ఆ నిధులు కేంద్రం ఏం చేస్తోంది?
``ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా?. గ్యాస్ ధర ఎంత ఉండేది.? ఇప్పుడు ఎంత చేశారు.?`` అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. అంతేకాదు.. ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ పరిమితమవుతోంది. బీజేపీ,టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఆదాయ లోటు భర్తీ కోసం గత్యంతరం లేని పరిస్థితుల్లో నాలుగు రూపాయాల సెస్ అప్పుడు విధించారన్నారు. రోడ్ల మరమ్మత్తుల కోసం రూపాయి సెస్ అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
లక్షా 87 వేల కోట్ల దోపిడీ!
కేంద్రం ఎక్సైజ్ డ్యూటీలోని కొంత శాతాన్ని తగ్గించిందని వివరించారు. కేంద్రం సాలీనా సెస్ పేరుతో రెండు లక్షల 87 వేల కోట్ల మేర వసూలు చేస్తుందని, దీనిలో ఒక్క రూపాయి కూడా రాష్ట్రాలకు ఇవ్వడం లేదని పేర్ని తెలిపారు. పెట్రోలు..డీజిల్ సెస్ గా మరో 47 వేల కోట్లు వసూలు చేస్తుందన్నారు. కేంద్రం పన్నుల వాటాగా పెంచితే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని..దీని నుంచి తప్పించి వారే వసూలు చేసుకొనే విధంగా సెస్ పేరుతో ప్రజల పైన భారం వేస్తున్నారని విమర్శించారు. విమర్శలు చేస్తున్న నేతలకు నిజాయితీ ఉంటే..పార్లమెంట్ వద్దకు వెళ్లి ధర్నా చేయాలని..ప్రధానిని ప్రశ్నించాలని సూచించారు.
ప్రజాగ్రహంతోనే.. తగ్గింపు
అన్ని రాష్ట్రాలు పెట్రోలు..డీజిల్ ధరలు తగ్గించాయంటూ బీజేపీ నేతలు చెబుతున్నారని.. .దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాలు తగ్గించలేదని వెల్లడించారు. మహారాష్ట్ర ..ఢిల్లీ..తెలంగాణ..పశ్చిమ బెంగాల్..తెలంగాణలో..కేరళ..జార్ఘండ్ లో ఎందుకు తగ్గించలేదని పేర్ని నాని ప్రశ్నించారు. బీజేపీ కి ఉప ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వటంతో వారికి ఇప్పుడు ప్రజాగ్రహం గుర్తుకు వచ్చిందని చెప్పారు.
చంద్రబాబు పెంచలేదా?
చంద్రబాబు అధికారంలో ఉన్న పెట్రోల్ పైన 31 శాతం.. డీజిల్ పపైన 22 పైగా శాతం టాక్స్ వేసారని మంత్రి వివరించారు. కేంద్రం ఇంత భారీ మొత్తంలో వసూలు చేస్తున్న సెస్ తో ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేసారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు మీకు కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు. వంట గ్యాస్ ధరల విషయంలోనూ స్పందించాలని డిమాండ్ చేసారు. ఇంకా పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించేలా ఏపీ బీజేపీ నేతలు ధర్నా చేయాలని మంత్రి పేర్ని నాని సూచించారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేసేందుకే భారీగా ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చిందని మంత్రి వివరించారు.