Begin typing your search above and press return to search.
పవన్ మీద పితాని పంచ్ అదిరిందిగా
By: Tupaki Desk | 5 Oct 2017 4:46 PM GMTమిత్రులుగా ఉన్నట్లుగా కనిపిస్తూనే కనిపించని రీతిలో మాటల కత్తులు నూరుకోవటం ఏపీ అధికారపక్షంలో కనిపిస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ తో ప్రచారం చేయించుకున్న టీడీపీ తమ్ముళ్లు.. ఇప్పుడు ఒకరి తర్వాత మరొకరు జనసేనాధినేతపై సటైర్లు వేయటం కనిపిస్తుంది. తాజాగా ఆ జాబితాలో చేరారు ఏపీ మంత్రి పితాని సత్యానారయణ. పవన్ కల్యాణ్ పై తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన పార్టీ గురించి పవన్ కల్యాణ్ నిర్మాణ బద్ధంగా ఆలోచించటం లేదన్నారు. ఏపీలో పవన్ పార్టీ జెండానే లేదంటూ పెద్ద మాటను అలవోకగా అనేశారు. అంతేకాదు.. పవన్ గురించి ఆలోచించే టైం తమకు లేదన్న ఆయన.. తమ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని తేల్చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో భుజం.. భుజం రాసుకుపూసుకొని తిరిగిన జనసేనాధి నేతపై మరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో మరింత క్రియాశీలకంగా పార్టీని నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా పవన్ చెప్పిన వేళ.. పవన్ పార్టీ జెండా అన్నదే రాష్ట్రంలో లేదన్న మాట పితాని నోట రావటం చూస్తే.. జనసేనను తాము అసలు లెక్కలోకి తీసుకోలేదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.
కూరలో కరివేపాకు మాదిరి పవన్ పార్టీని తీసేసిన పితాని మాటలపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఎన్నికల నాటి మిత్రుడి గురించి ఆలోచించే టైం కూడా లేదన్న పితాని మాటలకు పవన్ అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.