Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : మంత్రి రాస‌లీల‌లు.. రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు..!

By:  Tupaki Desk   |   2 March 2021 4:32 PM GMT
బ్రేకింగ్ : మంత్రి రాస‌లీల‌లు.. రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు..!
X
స‌మాజం ఎంత‌గా పురోగ‌మిస్తున్నా.. మ‌హిళల‌‌కు మాత్రం క‌నీస ర‌క్ష‌ణ కూడా లేకుండాపోతోంది. కంచే చేను మేసిన విధంగా.. అండ‌గా ఉండాల్సిన వారే.. మ‌హిళ‌ల పాలిట రాక్ష‌సులుగా త‌యార‌వుతున్నారు. సాక్షాత్తూ ఓ మంత్రి.. మ‌హిళ‌ను లైంగిక వేధించిన వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయంగా తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది! క‌ర్నాట‌క‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతం.. ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర ప్ర‌కంపన‌లు రేపుతోంది.

కర్ణాటక రాష్ట్ర‌ జలవనరుల శాఖ మంత్రి రమేశ్ వ‌ద్ద‌కు కొన్ని రోజుల క్రితం ఓ యువతి వెళ్లింది. షార్ట్ ఫిలిమ్ విషయమై సహకారం అడిగేందుకు స‌దరు మంత్రిని ఆ యువ‌తి సంప్ర‌దించింది. అయితే.. స‌హాయం కోరి వ‌చ్చిన యువ‌తిని.. లైంగికంగా వేధించేందుకు సిద్ధ‌మ‌య్యారు సదరు అమాత్యులు! ఆ యువతిని కేపీటీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి ప్రలోభపెట్టారు.

చివ‌ర‌కు ఆమెను లొంగ‌దీసుకొని లైంగికంగా వేధించారు. త‌న అవ‌స‌రం తీరిన త‌ర్వాత ఆమెకు ఉద్యోగం ఇప్పించ‌డానికి బ‌దులు.. వ‌దిలించుకునేందుకు త‌న‌దైన రీతిలో వ్య‌వ‌హ‌రించారు. అయితే.. స‌ద‌రు మంత్రిగారి వ్యవహారం మీడియాలో లీక్ కావడంతో.. కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. బాధిత యువతితో మంత్రి మాట్లాడిన సంభాషణలతోపాటు వీడియో టేపులు కూడా ప్ర‌సారం అవుతుండ‌డంతో తీవ్ర‌ దుమారం రేపుతున్నాయి.

ఓ మంత్రిగా ప్రజలకు రక్షకుడిగా ఉండాల్సిన వారే.. ఇలాంటి దారుణాల‌కు పాల్ప‌డుతుండ‌డంపై మ‌హిళా సంఘాలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. స‌ద‌రు మంత్రిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. విప‌క్షాలు సైతం మంత్రి తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. వెంట‌నే త‌న‌ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని, బాధిత యువ‌తికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. మ‌రి, దీనిపై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.