Begin typing your search above and press return to search.
షర్మిలకు మంత్రి పువ్వాడ గట్టి కౌంటర్.. ప్రభుత్వం నుంచి తొలిసారి తీవ్రంగా
By: Tupaki Desk | 17 Jun 2022 3:30 PM GMTఏపీలో 2019 ఎన్నికలు.. అంతకుముందు 2014 ఎన్నికల్లో పూర్తిగా వైఎస్సార్ సీపీ తరఫున ప్రచారం నిర్వహించి.. తన అన్న వైఎస్ జగన్ జైల్లో ఉండగా.. 2012లో ఏకంగా పాదయాత్రనే నిర్వహించిన వైఎస్ షర్మిల.. గతేడాది అనూహ్యంగా వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. అంతేకాదు.. ప్రజల్లో ఉండేలా తొలినాళ్లలోనే కార్యక్రమాలు నిర్వహించారు. అంతే తొందరగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఆమె పాదయాత్ర సాగిస్తున్నారు. షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆమె నేరుగా సీఎం కేసీఆర్ పైనే గురిపెట్టారు. అయితే, దీనికి టీఆర్ఎస్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ.. సరైన కౌంటర్ ఉండడం లేదు.అనవసరంగా స్పందించి షర్మిలను పెద్ద నాయకురాలిని చేయడం ఎందుకనే భావనే దీనికి కారణం కావొచ్చు. అయితే, షర్మిల మాత్రం తన విమర్శల దూకుడు ఎక్కడా తగ్గించడం లేదు.తెలంగాణలో ఉద్యోగ నియామకాల అంశాన్ని ఆమె లేవనెత్తుతుండడంతో.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజానిజాలను ప్రజలకు వదిలేసిందే తప్ప స్పందించి విమర్శలు చేయలేదు.
ఖమ్మంలో పోటీ చేస్తారంటూ..వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా పాలేరు లేదా ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. వీటిపై నిర్ధారణ లేదు. అయితే, విజయం సంగతి పక్కనపెడితే పోటీకి ఎక్కువ శాతం అవకాశాలు మాత్రం ఉన్నట్లు తెలుస్తోంది. అందులోనూ ఖమ్మం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నది పువ్వాడ అజయ్ కుమార్. వామపక్ష భావజాలం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అజయ్.. ప్రజల్లోకి చొచ్చుకెళ్లే నైపుణ్యం ఉన్న నాయకుడు.
దీంతోపాటు గత ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. కొంత ఆలస్యంగా అయినా.. ఆయనకు మంత్రి వర్గంలో కీలకమైన రవాణా శాఖ దక్కింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితుడనే పేరుంది. తాజాగా ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్ర సందర్బంగా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు మంత్రి అజయ్ కుమార్ దీటుగా బదులిచ్చారు.
దమ్ముంటే నాపై పోటీ చేయమంటూ..కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ ఇలా అన్ని పార్టీల ప్రాతినిధ్యం సాగిన నియోజకవర్గం ఖమ్మం. అలాంటిచోట అజయ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. షర్మిల సైతం ఇక్కడ నుంచి పోటీ చేస్తారంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో మంత్రి అజయ్ ఆమెకు గట్టి సవాల్ విసిరారు. అన్నతో పంచాయితీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలని.. తెలంగాణకు వచ్చి ఏం సాధిస్తారని ఆమెను ప్రశ్నించారు. ఇదేకాక.. మాజీ మంత్రి పరిటాల రవి హత్యను సైతం ప్రస్తావించారు. రవికి ఖమ్మం జిల్లాలోనూ అభిమానులున్నారు. కళ్లలో తూటాలు పేల్చి పరిటాల రవిని హత్య చేసింది మీరేనంటూ అజయ్ షర్మిలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో షర్మిల తనపై చేసిన విమర్శలకు స్పందిస్తూ. ఒట్టి పుణ్యానికి మంత్రి కాకపోతే మీ అన్నలా డబ్బులిచ్చి తీసుకోవాలా? పనిచేసిన వారినే సీఎం కేసీఆర్ గుర్తించి పదవులు ఇస్తారు.. అందుకు నేను గర్విస్తున్నా. దమ్ముంటే ఖమ్మంలో నాపై పోటీ చేసి గెలిచి చూపించు. పాలేరులోనూ నా దమ్ము చూపిస్తా" అని పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు.
వైఎస్, జగన్ పాలనను ఎత్తిచూపుతూ..దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు, ప్రస్తుతం ఏపీలో వైఎస్ జగన్ సీఎంగా ఉన్న నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ.. "ఉక్కు నుంచి భూముల వరకు అన్ని కబ్జాలు,దందాలు చేసిన ఘనత మీ కుటుంబానిదే. మీ తండ్రి, అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు చూస్తే అరాచకానికే సిగ్గుచేటు" అని ధ్వజమెత్తారు.
కొసమెరుపు : పువ్వాడ అజయ్ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు ఇప్పటికీ సీపీఐ నేతగా కొనసాగుతున్నారు. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. అయితే,అజయ్ మాత్రం వామపక్షాలను కాకుండా ఇతర పార్టీలను ఎంచుకున్నారు. తొలుత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్రంగా కష్టపడ్డారు. అనంతరం ఆ పార్టీ తెలంగాణ వ్యతిరేక నిర్ణయం తీసుకోవడంతో అజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరారు. 2014లో కాంగ్రెస్ తరఫున ఖమ్మం నుంచి గెలిచారు. కానీ, టీఆర్ఎస్ వైపు మొగ్గారు. 2018లో ఆ పార్టీ టికెట్ తో నేరుగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు.. తన రాజకీయ జీవితం ప్రారంభమైన వైఎస్ కుటుంబానికి చెందిన పార్టీ (ఒకవేళ) అభ్యర్థితోనే తలపడనున్నారు.