Begin typing your search above and press return to search.
పెళ్లి విందుకు వెళ్లి టీ మంత్రికి దారుణ అవమానం
By: Tupaki Desk | 2 March 2020 4:33 AM GMTతెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు దారుణ అవమానం జరిగింది. ప్రైవేటు సెక్యురిటీ సిబ్బంది ఓవరాక్షన్ గురించి తెలిసిన వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డాబు కోసం ఏర్పాటు చేసే ప్రైవేటు సెక్యురిటీ హద్దులు దాటేస్తున్న వైనం ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకుంటున్నా.. వారిపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజా అవమానం సొంత పార్టీకి చెందిన ఎంపీ ఇంట జరిగిన పెళ్లి విందు సందర్భంగా చోటు చేసుకోవటం గమనార్హం.
టీఆర్ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు హర్షరెడ్డి వివాహం ఇటీవల దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక సందర్భంగా పొంగులేటి మాష్టారు డ్యాన్స్ వేసిన వైనం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అంతేనా.. ఈ స్టెప్పుల వెనుక పొంగులేటి ఫ్యామిలీ ఎంతలా హోంవర్క్ చేశారన్న విషయానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
సెలబ్రిటీలు.. ప్రముఖుల ఇళ్లల్లో జరిగే వివాహ వేడుకల్లో పాటలకు డ్యాన్సులు వేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇదో కల్చర్ గా మారటంతో.. వివాహ వేడుకలో పాటలకు స్టెప్పులు వేయటం ఇప్పుడు తప్పని సరైంది. దీంతో.. వారు డ్యాన్స్ చేయటం కోసం తీవ్రంగా ఎక్సర్ సైజ్ చేయాల్సి వస్తోంది. పరిమిత కాలానికి ట్రైన్ తీసుకుంటున్నారు కూడా.
ఇదిలా ఉంటే.. దుబాయ్ లో పెళ్లి అనంతరం.. ఖమ్మంలో భారీ ఎత్తున రిసెప్షన్ నిర్వహించారు. ఇందుకోసం ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ వద్ద వంద ఎకరాల సువిశాల ప్రదేశంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బాహుబలి సినిమా తరహాలో సెట్టింగ్ వేయించారు కూడా.
ఇంత భారీ ఏర్పాట్లు చేసిన పొంగులేటి.. విందు కోసం వచ్చే అతిధులకు ఇవ్వాల్సిన మర్యాదల విషయాన్ని కాస్త మిస్ అయినట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. విందుకు వచ్చిన అతిధుల పట్ల ప్రైవేటు సెక్యురిటీ ప్రదర్శించిన ఓవరాక్షన్ పై మండిపాటు వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్ విందుకు వస్తున్న వేళలోనే.. మరో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెళ్లారు. అక్కడి ప్రైవేటు సెక్యురిటీ సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. దీంతో.. అసహనాన్ని వ్యక్తం చేసిన పువ్వాడ.. అక్కడున్న పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు సిబ్బంది చేసిన ఓవరాక్షన్ ను పలువురు తప్పు పడుతున్నారు.