Begin typing your search above and press return to search.
సెక్స్ మినిస్టర్ ఆడియోః యడ్యూరప్పపై సంచలన వ్యాఖ్యలు.. సీఎం పదవి గోవిందా?
By: Tupaki Desk | 4 March 2021 4:36 AM GMTకర్నాటక జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్కి సెక్స్ బాగోతం.. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఆ వీడియోలతోపాటు ఆడియో టేపుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్నే ఇరుకున పెట్టేశాయి. ఏకంగా ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో యడ్యూరప్ప సీఎం పదవి కూడా పోతోందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి.. ఆయన రాసలీలు ఏకంగా పార్టీనే అభాసుపాలు చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓ మహిళకు కర్నాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, పలుమార్లు అత్యాచారం చేశాడని బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త దినేష్ కుళ్లహళ్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వాటికి సాక్ష్యాలుగా మంత్రి రాసలీలల సమయంలో షూట్ చేసిన వీడియోలను కూడా అందజేశారు. వీటిలో మంత్రి రమేష్, సదరు మహిళ మాట్లాడుకున్న ఆడియో టేపులు కూడా ఉన్నాయి. ఈ టేపులు ఇప్పుడు తీవ్ర ప్రకపంనలు రేపుతున్నాయి. ఈ టేపుల్లో ముఖ్యమంత్రి యడ్యూరప్పపై రమేష్ జార్కి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
యువతిః బెల్గాంలో కన్నడ, మరాఠి ప్రజలు కొట్టుకుంటున్నారు కదా?
మంత్రి రమేష్ః మరాఠీలు చాలా మంచివారు, కన్నడిగులకు ఏం పనిలేదు. సిద్ధారామయ్య చాలా మంచివాడు. యడ్యూరప్ప భారీ అవినీతికి పాల్పడ్డాడు.
యువతిః మీరు చాలా సార్లు ఢిల్లీ వెళ్తున్నారు. సీఎం అవుతారా?
మంత్రి రమేష్ః ప్రహ్లాద్ జోషీ ముఖ్యమంత్రి అవుతారు.
ఆడియో టేపుల్లో పై విధంగా సాగిన ఇద్దరి సంభాషణ.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అలజడి రేపుతున్నాయి. సాక్షాత్తూ కేబినెట్ మినిస్టరే.. సీఎం అవినీతికి పాల్పడ్డాడని చెబుతుంటే.. ఇంకా ప్రత్యేకంగా చెప్పడానికి ఏముందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. యడ్డీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. ఇది కేవలం సెక్స్ స్కాండల్ మాత్రమే కాదని అన్నారు. ముఖ్యమంత్రి యడ్యూరప్పపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దీనిపై బీజేపీ అధిష్టానం సరైన రీతిలో స్పందిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
అయితే.. బీజేపీ అధిష్టానం యడ్యూరప్పను సీఎం పదవి నుంచి తప్పిస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. గతంలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా సీఎం మార్పుపై మాట్లాడి సంచలనం రేపారు. ఇప్పుడు ఏకంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడంతో యడ్డీ పదవికి ఎసరు వచ్చినట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా.. మొదట ఆ సెక్స్ వీడియోల్లో ఉన్నది తాను కాదని, అవి మార్ఫింగ్ చేశారని చెప్పారు. ఇదంతా ఓ రాజకీయ కుట్ర అని, తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని మంత్రి రమేష్ భీష్మించిన విషయం తెలిసిందే. కానీ.. ఆ తర్వాత వెంట వెంటనే పరిస్థితులు మారిపోయాయి. ఆయన రాజీనామా చేయడం.. గవర్నర్ వాజుభాయ్ వాలా వెంటనే ఆమోదించడం జరిగిపోయాయి.