Begin typing your search above and press return to search.
సెక్స్ వీడియో కలకలం.. స్పందించిన మంత్రి.. ఏమంటున్నారంటే..?
By: Tupaki Desk | 3 March 2021 6:35 AM GMTకర్నాటక బీజేపీ సీనియర్ నేత, జల వనరుల శాఖ మంత్రి రమేష్ జార్కిహోళి సెక్స్ కార్యకలాపాల వ్యవహారం ఆ రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. రమేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అనుబంధం విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది.
కర్నాటక పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని మంత్రి రమేష్ ఓ మహిళపై పలు మార్లు అత్యాచారం చేశారని బెంగళూరుకు చెందిన సామాజిక కార్యకర్త దినేష్ కుళ్లహళ్లి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. సాక్ష్యాలుగా చూపుతూ సెక్స్ వీడియోలను కూడా అందించారు. ఈ వీడియోలు మీడియాకు అందడంతో తీవ్ర దుమారం రేగుతోంది.
ఉత్తర కర్నాటక ప్రాంతానికి చెందిన సదరు మహిళకు మంత్రి ముందుగానే పరిచయం ఉండడం వల్ల డ్రోన్ల సహాయంతో కొన్ని రిజర్వాయర్లను చిత్రీకరించడానికి అనుమతి కోసం మంత్రి వద్దకు వెళ్లిందని, దాన్ని అవకాశంగా చూసుకొని మంత్రి లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన కామ వాంఛ తీర్చుకోవడానికి సదరు మహిళను ఢిల్లీ తీసుకెళ్లి, ఏకంగా అక్కడి కర్నాటకక భవన్ లో ఈ లైంగిక చర్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే.. ఈ ఆరోపణలపై రోజంతాగా మౌనంగా ఉన్న రమేష్.. ఎట్టకేలకు స్పందించారు. ఆ వీడియోల్లో ఉన్నది తానుకాదని, అవి మార్ఫింగ్ చేశారని చెప్పారు. మీడియాలో తనపై వస్తున్న వార్తలు చూసి షాకయ్యానని అన్నారు. దేవుడి సాక్షిగా చెబుతున్నానని, ఆ మహిళ ఎవరో తనకు తెలియదని చెప్పుకొచ్చారు మంత్రి. ఇది రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణించారు.
తాను రాజకీయాల్లో 21 సంవత్సరాలుగా ఉన్నానని, ఏనాడూ ఆరోపణలు రాలేదని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తాను సీఎం యడ్యూరప్పతో మాట్లాడానని, ఈ వీడియోల గుట్టు తేల్చాలని కోరినట్టు చెప్పారు మంత్రి రమేష్ .
కాగా.. ఇవాళ కర్నాటక మంత్రి వర్గం భేటీకాబోతోంది. అయితే.. ఇది ముందుగానే షెడ్యూల్ చేసిన ప్రోగ్రాం అయినప్పటికీ.. రమేష్ సెక్స్ వీడియోల వ్యవహారంతో అందరి కళ్లూ ఈ సమావేశంపైనే పడ్డాయి. మరి, ఈ సమావేశానికి రమేష్ ను ఆహ్వానిస్తారా? లేదా? అన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. పిలుపు రాకపోతే మాత్రం వేటు పడ్డట్టుగానే భావించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.