Begin typing your search above and press return to search.
రాసలీలల సీడీ అప్డేట్..ఆమె కోసం హైదరాబాద్ లో గాలింపు
By: Tupaki Desk | 16 March 2021 6:30 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. బంగారం లాంటి మంత్రి పదవిని పోగొట్టుకున్న రమేశ్ జార్కిహోళి ఉదంతం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన వద్దకుసాయం కోసం వచ్చిన ఒక మహిళతో రాసలీలలు చేస్తూ వీడియో కంటికి చిక్కటమే కాదు.. అది కాస్తా సోషల్ మీడియా.. వాట్సాప్ లలో వైరల్ గా మారింది సంచలనమైంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో మంత్రి రమేశ్ తన పదవికి రాజీనామా చేసి మాజీ అయిపోయారు.
ఇదిలా ఉంటే.. ఈ సీడీ వెనుక ఎవరున్నారు? అన్న విషయాన్ని తేల్చటంతో పాటు.. ఈ మొత్తం ఎపిసోడ్ పై విచారణ జరుపుతున్నారు. సీడీలో కనిపించిన యువతి.. వైరల్ అయ్యాక ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటివేళ.. ఒక వీడియో మెసేజ్ ను సదరు మహిళ పోస్టు చేయటంతో ఆమె క్షేమంగానే ఉన్నట్లుగా తేలింది.
తన ప్రాణాలకు ముప్పు ఉందని.. తనకు భద్రత కల్పించాలని ఆమె కోరుతున్నారు. సీడీ బయటకు వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి ముంబయికి.. అక్కడి నుంచి తిరుపతి.. ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నట్లుగా భావిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు బెంగళూరు పోలీసులు తాజాగా హైదరాబాద్ కు వచ్చి విచారణ జరుపుతున్నారు. ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తనను మోసగించారని మాజీ మంత్రిపై ఆరోపణలు చేసిన యువతిని నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. విచారణకు హాజరుకావాలని బాగల్ కోటలో ఆమె ఇంటికి నోటీసులు అంటించినా స్పందన లేదని.. ఎవరూ విచారణకు హాజరుకాలేదని చెబుతున్నారు. సీడీలోని యువతి ఆచూకీ దొరికితే.. ఈ ఇష్యూ ఒక కొలిక్కి వస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ.. ఆమె హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నట్లు?