Begin typing your search above and press return to search.
రావెలకు రెడ్ కార్డ్ తప్పేలా లేదు
By: Tupaki Desk | 5 March 2016 11:30 AM GMTఅసలే ఆయన పెర్ఫార్మెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం సంతృప్తిగా లేరు. తరచూ అక్షింతలు పడుతుంటాయి. అలాంటి మంత్రి రావెల కిశోర్ బాబు మరిన్ని వివాదాల్లో కూరుకుపోతూ చంద్రబాబు ఆగ్రహానికి గురవుతున్నారు. రీసెంటుగా రాజధాని భూముల వ్యవహారంలో మిగతా మంత్రులతో పాటు రావెల పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. దానిపై చంద్రబాబు ఇప్పటికిప్పుడు మంత్రులను నేరుగా టార్గెట్ చేయకపోయినా కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఈలోగా రావెలకు కుమారుడి రూపంలో మరో చిక్కు వచ్చిపడింది. రావెల తనయుడు సుశీల్ హైదరాబాద్ లో ఓ వివాహిత చేయిపట్టుకుని లాగడం... స్థానికులు చితక్కొట్టడం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తప్ప తాగిన రావెల సుశీల్ జూబ్లీహిల్స్ లో రోడ్డుపై వెళ్తున్న మహిళా టీచర్ ను రావెల తనయుడు అడ్డగించి తన కారులో ఎక్కాలంటూ చేయి పట్టి లాగాడు. దీంతో స్థానికులు సుశీల్ ను చితకబాదారు. పోలీసుల వద్దా సుశీల్ రెచ్చిపోయి తన ప్రతాపం చూపిస్తానంటూ వీరంగం చేశాడు. స్థానికులు పట్టుకున్నప్పుడు కూడా సుశీల్ మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసి వారి ఆగ్రహానికి గురయ్యాడు. మహిళలను ఏమయినా చేయవచ్చని ఖురాన్ లోనే ఉందని ఆయన అనడం ఇంకో వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి ఇంత హంగామా చేయడంతో వ్యవహారం మీడియాలోనూ బాగా ఫోకస్ అయిపోయింది.
చంద్రబాబు దీన్ని కూడా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. ఇది రావెల ప్రత్యక్ష పొరపాటు కాకపోయినా మంత్రి కుమారుడే మహిళలతో అంత నీచంగా ప్రవర్తిస్తే రాష్ట్రంలో మహిళలకు ఎలా భరోసా ఇస్తామని చంద్రబాబు ఒకరిద్దరి వద్ద అన్నట్లు సమాచారం. పనితీరు సరిగా లేకపోవడం, అవినీతి ఆరోపణలు - మంత్రి తనయుడి అరాచకాల నేపథ్యంలో ఆయన్ను కేబినెట్ లో కొనసాగిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదముందని చంద్రబాబు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మంత్రి రావెలకు వచ్చే విస్తరణ సమయంలో రెడ్ కార్డ్ తప్పదని అంటున్నారు.