Begin typing your search above and press return to search.

కొడాలి నానిపై ఈగ వాలినా స‌హించం: మంత్రి రోజా కామెంట్స్ వైర‌ల్‌!

By:  Tupaki Desk   |   15 Sep 2022 8:34 AM GMT
కొడాలి నానిపై ఈగ వాలినా స‌హించం:  మంత్రి రోజా కామెంట్స్ వైర‌ల్‌!
X
ఆంధ్ర‌ప్రదేశ్ రాజ‌కీయ నేత‌ల దూష‌ణ‌లు హ‌ద్దులు దాటుతున్నాయి. ప్ర‌జ‌లు న‌వ్వుకుంటారనే చిన్న‌పాటి కామ‌న్‌సెన్స్ కూడా లేకుండా య‌థేచ్ఛ‌గా మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడేస్తున్నాన‌ర‌ని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్పుడు ఈ కోవ‌లో మ‌హిళా మంత్రి ఆర్కే రోజా కూడా చేరిపోయారు. నారా లోకేష్‌ను వాడు వీడు అంటూ రోజా చెల‌రేగిపోయారు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తూ ప్ర‌జ‌ల‌తో నారా లోకేష్‌ను కొట్టిస్తామంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం జ‌గ‌న్ గురించి అమ‌ర్యాద‌గా మాట్లాడితే లోకేష్‌ను చూస్తూ ఊరుకోబోమ‌న్నారు. అలాగే కొడాలి నాని మాట్లాడే భాష‌లో త‌ప్పేముంద‌ని ఎదురు ప్ర‌శ్నించారు. కొడాలి నాని గ‌డ్డంలో తెల్ల వెంట్రుక కూడా టీడీపీ నేత‌లు పీక‌లేర‌ని రోజా ఎద్దేవా చేశారు.

కొడాలి నానిని ధైర్యంగా ఎదుర్కోలేక ఆయ‌న ఇంటిపైకి మ‌హిళ‌ల‌ను ఆయ‌న ఇంటిపైకి పంపారని ఆర్కే రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొడాలి నానిపై ఈగ వాలినా స‌హించ‌బోమ‌న్నారు. రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ సీఎం జగన్ పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామంటూ రోజా హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుపై కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేపడుతున్న నిరసనల్ని మంత్రి రోజా తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు.

రాష్ట్రంలో లక్ష‌ల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చ‌రిత్ర జ‌గ‌న్ ప్ర‌భుత్వానిద‌ని ఆర్కే రోజా తెలిపారు. టీడీపీ నేత‌లు గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందని చెప్పారు. నిరుద్యోగుల‌ను మోసం చేసిన చరిత్ర టీడీపీద‌న్నారు. మూడు రాజధానుల బిల్లు పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని టీడీపీ ఎమ్మెల్యేలు ప్ర‌శ్నించ‌డం హాస్యాస్ప‌ద‌మ‌న్నారు.

ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విష‌యంలో ప్ర‌భుత్వం ముందుకెళ్తుంద‌ని తెలిపారు. మూడు రాజ‌ధానుల అజెండాతోనే వివిధ ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ ఘ‌న విజ‌యాలు సాధించింద‌ని గుర్తు చేశారు. మూడు రాజధానుల విష‌యంలో త‌మ పార్టీ ఎమ్మెల్యే లు ఎందుకు రాజీనామా చేయాలని నిలదీశారు.

చంద్ర‌బాబు తన స్వార్థం కోసం టీడీపీనే కాకుండా రాష్ట్రాన్ని నాశ‌నం చేశాడ‌ని రోజా మండిప‌డ్డారు. అందువ‌ల్లే త‌న‌తోపాటు కొడాలి నాని, ఇలా అంద‌రం టీడీపీ నుంచి బ‌య‌ట‌ప‌డ్డామ‌ని చెప్పారు. అడ్ర‌స్ లేని వెధ‌వ లోకేశ్.. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.