Begin typing your search above and press return to search.
రోజా దశ తిరిగినట్టేనా.. కొడుక్కి గిఫ్టుగా బెంజ్ కారు!
By: Tupaki Desk | 14 July 2022 1:30 PM GMTఆర్కే రోజా ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో కేబినెట్ విస్తరణలో ఎట్టకేలకు మంత్రి పదవి దక్కించుకున్నారు. ప్రస్తుతం పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో మంత్రిగా పనిచేయాలన్న తన చిరకాల వాంఛను రోజా నెరవేర్చుకున్నట్టైంది.
దీంతో మంత్రి కావడంతో ఒక టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ తోపాటు ఇతర టీవీ షోలకు ఆమె దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె తాజాగా బెంజ్ కారును కొనుగోలు చేసి తన కొడుక్కి గిఫ్టుగా ఇచ్చారు. దీనిపై రోజాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మంత్రి కావడంతో రోజా దశ తిరిగిందని.. ఇక బెంజ్ కార్లకు కొదవేముందని ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఓ సందర్భంలో రోజా.. తాను అంత ధనికురాలిని కాదన్న మాటల వీడియో క్లిప్పింగ్ ను పట్టుకుని ఆమెను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు.
రోజా మంత్రి కాక ముందు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ గా కేబినెట్ హోదాలో పనిచేశారు. ఇందుకు నెలకు కొన్ని లక్షల జీతంతోపాటు ఇతర సౌకర్యాలు, అలవెన్సులు పొందారు.
ఆ డబ్బులతోనే ఈ బెంజ్ కారు పొందారని గాసిప్స్ వస్తున్నాయి. మరోవైపు జబర్దస్త్ షోలు, ఇతర టీవీ కార్యక్రమాల ద్వారానూ ఆమె భారీగానే సంపాదించిందని.. ఆ డబ్బులు పెట్టే బెంజ్ కారు కొన్నారని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. మరికొంతమంది మంత్రిగా ఎవరికో ఏ మేలో చేసిపెట్టి ఉంటారని.. వారు ఆ రుణం బెంజ్ కారు కొనిచ్చి తీర్చుకున్నారని అంటున్నారు.
కాగా రోజా బెంజ్ కారును ఆవిష్కరించి తన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులను ఎక్కించుకుని కారు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఆమె అభిమానులు లైకులు, కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.