Begin typing your search above and press return to search.
బంజారాహిల్స్ కేర్ లో మంత్రి సబిత.. ఏమైంది?
By: Tupaki Desk | 15 May 2020 6:30 AM GMTతెలంగాణ రాష్ట్ర మంత్రిగా సుపరిచితులు. . సీనియర్ రాజకీయ నేత సబితా ఇంద్రారెడ్డి ఆసుపత్రిలో చేరారన్న సమాచారం కలకలం రేపుతోంది. అర్థరాత్రి వేళ.. ఆమె అనారోగ్యానికి గురి కావటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో.. ఆమె ఆరోగ్యంపై కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ఇంతకూ ఆమెకు ఎదురైన ఆరోగ్య సమస్య ఏమిటి? ఇప్పుడు ఎలా ఉన్నారు? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం గురువారం అర్థరాత్రి వేళలో.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పితో ఇబ్బంది పడ్డ ఆమెను.. హుటాహుటిన బంజారాహిల్స్ లోని కేర్ కు తీసుకొచ్చారు. వెంటనే.. ఆమెను ఆసుపత్రిలో ఆడ్మిట్ చేసిన వైద్యులు.. పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎలాంటి సమస్య లేదని చెబుతున్నారు. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకురావటం మేలు చేసిందన్న మాట వినిపిస్తోంది. ఆసుపత్రిలో ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్టులు కొన్ని గంటల్లో రావొచ్చని చెబుతున్నారు. ఇప్పటికైతే.. ఆమె ఆరోగ్యం బాగుందని.. ఎలాంటి సమస్యా లేదని చెబుతున్నారు.
మంత్రి సబిత ఆసుపత్రి లో చేరారన్న విషయాన్ని తెలుసుకున్న పలువురు నేతలు.. క్యాడర్ ఆందోళనకు చెందుతున్నారు. దీంతో.. అలాంటి ఆందోళనలకు చెక్ పెట్టేందుకు వీలుగా.. తనకు ఫోన్ చేసే వారందరికి ఓపిగ్గా బదులు ఇస్తున్నారు. తాను ఆసుపత్రి లో చేరిన మాట వాస్తవమే కానీ.. ఆరోగ్య పరిస్థితి బాగుందని.. ఇప్పుడెలాంటి సమస్యా లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. వైద్యులు సైతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా పేర్కొన్నారు.