Begin typing your search above and press return to search.
కేసీఆర్ మనవడి ప్రాజెక్ట్.. కష్టపడ్డ మంత్రి సత్యవతి
By: Tupaki Desk | 20 Nov 2019 7:21 AM GMT‘అరె సీఎం మనవడయ్యా బాబూ.. ఆ మాత్రం ఖదర్, పరపతి, పలుకుబడి ఉండవా ఏందీ.? ’ అంటే ఉంటాయి.. కానీ ఆ అధికారాన్ని సక్రమంగా వాడితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు.. దుర్వినియోగం చేస్తేనే ఇబ్బందులు అని ఇప్పుడీ సంఘటన చూశాక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి...
మన ఇంట్లో పిల్లలకు స్కూల్లో ప్రాజెక్టులు ఇస్తారు. దానికి వాళ్లకంటే మనమే కష్టపడుతాం.. అదో ఇదో చేసి ప్రాజెక్టును సబ్ మిట్ చేయిస్తాం.. కానీ అక్కడ కేసీఆర్ మనవడికి కూడా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ‘బాలల సంక్షేమం’పై ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. దానిపై ఒక సెలబ్రెటీని ఇంటర్వ్యూ చూసి బాలల సంక్షేమం గురించి ప్రాజెక్టు ఇవ్వాలని సూచించారు.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.? కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు తలుచుకుంటే ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం పెద్ద అదా అందుకే.. ఏకంగా తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ నే ఇంటర్వ్యూ చేశాడు హిమాన్షూ. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సత్యవతిని ఇంటర్వ్యూ చేస్తున్న ఫొటోను షేర్ చేశాడు.
కాగా అంతకుమందు ఇదే మంత్రి సత్యవతి సైదాబాద్ లోని జువైనైల్ హోంను సందర్శించారు. అక్కడ బాల నేరస్థుల స్థితగతులను తెలుసుకున్నారు. అక్కడి కూడా హిమాన్సు పర్యటించి బాలల సంక్షేమంపై రిపోర్ట్ రాసుకున్నారు.
ఇలా కేసీఆర్ మనవడి ప్రాజెక్ట్ వర్క్ కోసం ఏకంగా మంత్రి సత్యవతి పాలుపంచుకోవడం.. కష్టపడడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.