Begin typing your search above and press return to search.

ప‌లాస‌లో గ్రూపులు.. మంత్రి సీదిరికి క‌ష్టాలేనా...?

By:  Tupaki Desk   |   29 Jan 2022 12:30 AM GMT
ప‌లాస‌లో గ్రూపులు.. మంత్రి సీదిరికి క‌ష్టాలేనా...?
X
శ్రీకాకుళం జిల్లాలోని కీల‌క‌మైన ప‌లాస నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య గ్రూపులు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజు ప్ర‌స్తు తం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. వాస్త‌వానికి ఆయ‌న మంత్రి కాక‌ముందు.. త‌ర్వాత‌.. అనేలా ఇక్క‌డి రాజ‌కీయాలు మారిపోయాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. గ‌తంలో టీడీపీ కీలక నాయ‌కురా లు.. గౌతు శిరీష‌ను ఓడించేందుకు అన్ని వ‌ర్గాల‌కు చేరువ అయిన అప్ప‌ల‌రాజు.. అంద‌రినీ త‌మ వారిగా చేసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయారు.

దీంతో అంద‌రూ సీదిరి మ‌నోడే.. అనుకున్నారు. ఆయ‌న గెలుపు కోసం కృషి చేశారు. అయితే.. ఆయ‌న మంత్రి అయిన త‌ర్వాత‌.. చాలా మందిని దూరం పెట్టార‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గ‌త‌లో ఆయ‌న గెలుపున‌కు కృషి చేసిన వారిని పూర్తిగా ప‌క్క‌న పెడుతున్నార‌ని.. కేడ‌ర్ భ‌గ్గుమంటున్న ప‌రిస్థితి క‌నిపి స్తోంది. ముఖ్యంగా రెండున్న‌రేళ్లు అయినా.. త‌మ‌ను సీదిరి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. వ్యాఖ్యానిస్తున్న గ‌ళాలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. అంతేకాదు.. ప‌థ‌కాలు.. ప‌నులు, కాంట్రాక్టులు కూడా కొంద‌రికే ద‌క్కుతున్నాయ‌ని.. మిగిలిన వారికి రిక్త హ‌స్తాలే మిగులుతున్నాయ‌నివారు బాహాటంగానే వ్యాఖ్యానిస్తు న్నారు.

ఇక‌,మంత్రిగారికి అనుకూల‌,వ్య‌తిరేక వ‌ర్గాలు పెరిగిపోయాయి. దీంతో త‌న‌కు అనుకూల వ‌ర్గం ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ప్ర‌తికూల వ‌ర్గం.. ఎక్క‌డ టీడీపీతో చేతులు క‌లుపుతుందోన‌ని మంత్రి వ‌ర్యులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌న‌ను వ్య‌తిరేకించే వారిపై సామ దాన భేద దండోపాయాలు ప్ర‌యోగిస్తున్నారు. దారికి రానివారిని బుజ్జ‌గిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు ఇంకా.. దారికి రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో మంత్రికి ఇబ్బంది క‌ర ప‌రిస్థితి త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయిన‌ప్ప‌టికీ.. సీదిరి మాత్రం త‌న ప్ర‌య‌త్నం త‌ను చేస్తున్నారు.

వాస్త‌వానికి ప‌లాస‌నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ కేడ‌ర్ ఎక్కువ‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత హ‌వా, ఆయ‌న పాద‌యాత్ర కార‌ణంగా.. అప్ప‌ల‌రాజు గెలుపు గుర్రం ఎక్కార‌నే వాద‌న ఉంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకోవాలంటే.. ఖ‌చ్చితంగా.. ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషిగానేకాకుండా.. కేడ‌ర్ మ‌ని షిగా కూడా గుర్తింపు తెచ్చుకోవాలి. కానీ, ఇప్పుడు కేడ‌ర్‌లోనే రెండు నుంచి మూడు గ్రూపులు ఏర్ప‌డ‌డం.. అసంతృప్తి సెగ‌లు క‌క్కుతుండ‌డం పైగా ఎవ‌రూ దారికి రాక‌పోవ‌డం వంటివి మంత్రికి తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది. ఇదే ప‌రిస్థితి మ‌రో రెండేళ్లు కొన‌సాగితే.. గెలుపు గుర్రం ఎక్క‌డం కూడా క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.