Begin typing your search above and press return to search.

శ్రీ‌కాకుళం వార్త : మ‌రో వివాదంలో మంత్రి సీదిరి ?

By:  Tupaki Desk   |   1 May 2022 11:30 PM GMT
శ్రీ‌కాకుళం వార్త : మ‌రో వివాదంలో మంత్రి సీదిరి  ?
X
శ్రీ‌కాకుళం జిల్లాలో విభిన్న వాద‌న‌ల‌కు ఆన‌వాలుగా భావ‌న‌పాడు నెల‌కొని ఉంది. ముఖ్యంగా వ‌చ్చే నెల‌లో ప్లెబిసైట్ నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. పోర్టు నిర్మిత ప్రాంతానికి సంబంధించి ప్ర‌యివేటు భూమి ఎక్కువ కావాల్సి ఉంది. ఇక్క‌డ ప్ర‌భుత్వ భూమి త‌క్కువ‌గా ఉంది. గ‌తంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉద్దానం వాకిట్లో ఎన్నో ఉద్య‌మాలుజ‌రిగాయి.. ధ‌ర్మ‌ల్ కు వ్య‌తిరేకంగా ఆ రోజు సోంపేట వాసులు మూకుమ్మ‌డిగా ఉద్య‌మించ‌కుంటే ఇవాళ అక్కడ బీల ప్రాంతం నామ‌రూపాల్లేకుండా పోయేది.

ఇప్పుడు కూడా అదే ఉద్య‌మ స్ఫూర్తితో క‌లెక్ట‌ర్ కానీ మంత్రి సీదిరి కానీ ఎవ్వ‌రు చెప్పినా కూడా విన‌ప‌డ‌డం లేద‌ని చెబుతూ త‌మ‌కు తాము కోరుకున్న విధంగా ప‌రిహారం ఇవ్వ‌కుండా ఉంటే చచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌ని చెబుత‌న్న భావ‌న‌పాడు పోర్టు ప్ర‌భావిత ప్రాంత గ్రామాల గోడు ఇవాళ జ‌గ‌న్ సర్కారు భ‌విత‌ను ప్ర‌శ్నార్థ‌కం చేస్తోంది.

ఇంకా చెప్పాలంటే మంత్రిపై తిరుగుబాటు చేసేందుకు కూడా ఇక్క‌డి గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి. నిన్న‌టి వేళ గోపాల‌పురం ఎమ్మెల్యేకు భౌతిక దాడి రూపంలో జ‌రిగిన పౌర స‌న్మాన‌మే మంత్రి సీదిరికి జ‌రిగినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు. త‌మ‌ను సంప్ర‌దించ‌కుండా ఏక‌ప‌క్షంగా భూ సేక‌ర‌ణ‌కు వెళ్తే సీదిరికి చుక్క‌లు చూపించ‌డం ఖాయం.

ఉప్పునీటి ఊయ‌ల‌ల మ‌ధ్య నిత్యం జీవించే ఆ జీవితాల‌కు ఇంకొన్ని స‌మ‌స్య‌లే స‌వాళ్ల‌వుతున్నాయి. కోట్లు విలువ చేసే భూములు తాము ఇవ్వ‌మ‌ని, ప్ర‌భుత్వం ఇచ్చే ప‌రిహారం ఏమీ కాద‌ని తేల్చేస్తున్నాయి. పోర్టు నిర్మాణంకు త్యాగాలు చేయ‌డం క‌న్నా ముందు త‌మ జీవితాలను భ‌విష్య‌త్ కాలంలో అంధ‌కారం చేసుకోలేమ‌ని చెబుతున్న వైనం ఇవాళ శ్రీ‌కాకుళం జిల్లాలో భావ‌న పాడు పోర్టు నిర్మాణ విష‌య‌మై నెల‌కొంది.

మంత్రి సీదిరి సొంత సామాజిక వ‌ర్గం మ‌నుషుల‌కు క‌నీసం స‌ర్ది చెప్ప‌లేక‌పోతున్నారు. ప‌రిహారంతో పాటు అన్ని వ‌స‌తుల‌తో కూడిన భూమిని ప‌రిహారం కింద ఇస్తామ‌ని కూడా చెబుతున్నారు. అంటే చంద్ర‌బాబు ఫార్ములా ఇది. భూమికి భూమితో పాటు పరిహారం కూడా ! అయినా కూడా గత అనుభ‌వాల రీత్యా భావ‌న పాడు పోర్టు ప‌నులకు భూములు ఇవ్వ‌మ‌ని తేల్చిచెప్పి త‌మ‌ను చంపేయండి అని తెగేసి చెబుతున్నారు. మొండి ధైర్యంతో మ‌రో ఉద్య‌మానికి శ్రీ‌కారం దిద్దుతున్నారు.

అభివృద్ధి చేయండి కానీ పొట్ట‌లు కొట్ట‌వ‌ద్దు.. ఇదే నినాదం ఎప్ప‌టి నుంచో శ్రీ‌కాకుళంలో వినిపిస్తూ ఉంది. కాస్త‌యినా ప్ర‌జా స్వామ్య ప‌రిర‌క్ష‌ణ అన్న‌ది లేకుండా పాల‌కుల చ‌ర్య‌ల‌ను కొన్నింటిని వెన‌క్కు తీసుకోవ‌డంలో ప్ర‌జా ఉద్య‌మాలే కీల‌కం అయ్యాయి. ఉద్య‌మ చైత‌న్యం వెల్లి విరిసిన నేల‌లో మ‌రో స‌మ‌స్య తాండ‌విస్తోంది. అదే భావ‌న‌పాడు. పోర్టు నిర్మాణం పూర్త‌యితే ఏమౌతుంది

ఎంత మందికి ఉపాధి అన్న‌ది ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఆ స్ప‌ష్టత అదానీ కంపెనీయే ఇవ్వ‌లేక‌పోతోంది. కానీ భూ సేక‌ర‌ణ బాధ్య‌త మాత్రం స‌ర్కారుదే ! దీంతో మూల పాడు (కొత్త‌గా మార్చిన ప్ర‌దేశం) లో ఏర్పాటు చేయాల‌నుకుంటున్న భావ‌న‌పాడు పోర్టు నిర్మాణంపై చాలా సందిగ్ధ‌త‌లు ఉన్నాయి.