Begin typing your search above and press return to search.

ఆయ‌న నియోజ‌కవ‌ర్గానికే మంత్రి.. సిక్కోలులో హాట్ టాపిక్‌..!

By:  Tupaki Desk   |   29 Aug 2022 1:30 AM GMT
ఆయ‌న నియోజ‌కవ‌ర్గానికే మంత్రి.. సిక్కోలులో హాట్ టాపిక్‌..!
X
సాధార‌ణంగా..మంత్రి అంటే.. రాష్ట్రం మొత్తానికి మంత్రి అని అర్ధం. రాష్ట్రంలో త‌న శాఖ‌కు సంబంధించి న అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అదే స‌మ‌యంలో ఆయా శాఖ‌ల‌కు సంబంధిం చిన అభివృద్ధి ప‌నులను ప్రాజెక్టుల‌ను కూడా వ‌డివ‌డిగా ముందుకు తీసుకు వెళ్తారు. గ‌తంలో ఉన్న మంత్రులు ఇదే పని చేసేవారు.అంతేకాదు.. రాజ‌కీయంగా చూసుకున్నా.. త‌న నియోజ‌క‌వ‌ర్గం విష‌యం క‌న్నా .. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు.. రాష్ట్ర అభివృద్ధి వంటి కీల‌క‌మైన అంశాల‌పై ఫోక‌స్ చేసేవారు.

దీంతో వారికి స‌హ‌జంగానే కోరుకోకుండానే పేరువ‌చ్చేది. ఇటు రాష్ట్రానికి కూడా పేరు తెచ్చిపెట్టేవారు. అ యితే.. ఇప్పుడు మారిపోయిన ప‌రిస్థితుల నేప‌థ్యం కావొచ్చు.. కొంద‌రు వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను పెంచుకునేం దుకు కావొచ్చు.. ఇవ‌న్నీ కాకుండా.. వారి గ్రాఫ్ ప‌డిపోతోంద‌నే దిగులుతో కావొచ్చు.. మొత్తంగా చూస్తే.. ప‌లాస నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాష్ట్ర ప‌శుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్ప‌ల రాజు మాత్రం వివాదాల‌కు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

అంతేకాదు... నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాలు బ‌య‌ట పెట్ట‌కుండా ఉండడంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గానికే మంత్రా ? అనేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి మంత్రి అంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించాలి. రాష్ట్రంలో త‌న శాఖ‌కు చెందిన స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న తెలుసుకోవాలి. కొత్త కొత్త ప్ర‌యోగాలు చేయాలి. గ‌తంలో ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రిగా ఉన్న మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌.. విదేశీ ప్ర‌యాణం చేసి.. మ‌రీ.. నూత‌న సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలో వెట‌ర్నరీ వైద్య‌శాల‌లు.. ప్ర‌యోగాల‌కు బీజం ప‌డింద‌నేది వాస్త‌వం. అస‌లు బుద్ధ ప్ర‌సాద్‌తో పోల్చుకుంటే సీదిరి ఆ శాఖ‌కు ఏ మాత్రం వ‌న్నె తేవ‌డం లేదు స‌రిక‌దా ? ఆయ‌న‌తో పోలిస్తే 10 శాతం కూడా స‌రితూగ లేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ‌లే ఉన్నాయి. సీదిరి ప‌లాస దాటి బ‌య‌ట‌కు రావ‌డ‌మే గ‌గ‌న‌మైపోతోంద‌ని అంటున్నారు.

శిరీష్ దూకుడు దెబ్బ‌తో త‌న ఓట‌మి ఖాయ‌మైంద‌ని ఆయ‌న భావిస్తున్నారో..లేక పలాస‌పై చేజారుతోన్న ప‌ట్టు నిలుపుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారో ఆయ‌న మాత్రం.. నియోక‌వ‌ర్గాన్ని వీడి ముందుకు రావ‌డం లేదు. దీంతో ఆయ‌న‌కు లోక‌ల్ మినిస్ట‌ర్ అనే ముద్ర ప‌డిపోయింది.






నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.