Begin typing your search above and press return to search.

నేను మట్టి, పేడలో పుట్టా కరోనా నా దరిదాపుల్లోకి రాదన్న మంత్రి !

By:  Tupaki Desk   |   9 Sep 2020 2:30 AM GMT
నేను మట్టి, పేడలో పుట్టా కరోనా నా దరిదాపుల్లోకి రాదన్న మంత్రి !
X
కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచం మొత్తం వ్యాపించి అందరి భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ వ్యాపిస్తూ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అయితే , కరోనా వెలుగులోకి వచ్చిన నెలలు గడుస్తున్నా కూడా దీనికి సరైన వ్యాక్సిన్ ఐతే ఇంకా రాలేదు. ఈ కరోనా భారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. సామాన్యుల నుండి ప్రముఖులు , రాజకీయ నాయకులు కూడా కరోనా భారిన పడుతున్నారు .

ఇక అసలు విషయానికొస్తే .. ఈ కరోనా టీకా కోసం అందరూ ఎదురుచూస్తుంటే కొందరు మాత్రం ఆ మంత్రం చెప్తే కరోనా సోకదు , ఇది తింటే కరోనా దరి చేరదు అని ప్రజలకి సలహా ఇస్తున్నారు. ఈ సలహాలు ఇచ్చేవారిలో రాజకీయ నాయకులు కూడా ఉండటం గమనార్హం. కరోనా రాకుండా ఉండాలంటే ఆల్కాహాలు తాగాలి”, ”బురదలో కూర్చొని శంఖం పూరిస్తే కరోనా రాదు”.. ”గోమూత్రం తాగండి. కరోనాకు దూరంగా ఉండండి” .. ”కరోనా రాకుండా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి పాపడ్‌లు తినండి” ..అంటూ చాలామంది సలహాలు ఇచ్చారు. అలా ఇచ్చిన వారిలో కొంతమందికి ఈ వైరస్ సోకడం విశేషం.

తాజాగా మధ్యప్రదేశ్ మంత్రి ఇమర్తి దేవీ కీలక కామెంట్లు చేశారు. ఇమర్తి దేవికి కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ అయ్యిందంటూ ఇటీవల వార్తలు రాగా, వాటిపై ఆమె స్పందించారు. తాను పేడ, మట్టిలో పుట్టానని కరోనా తన దరిదాపుకు కూడా రాదని ఇమర్తి దేవి అన్నారు.నాకు కరోనా ఉన్నట్లు మీరు చెబుతున్నారు. నేను మట్టి, పేడలో పుట్టా. కరోనా నా దరిదాపుల్లోకి కూడా రాదు అంటూ ఆమె తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.