Begin typing your search above and press return to search.
అనంతపురం మంత్రి ప్రోగ్రామ్స్ వైపు చూడని ఎమ్మెల్యేలు!
By: Tupaki Desk | 8 Sep 2019 5:15 AM GMTఅనంతపురం జిల్లాలో ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాదించిన సంగతి తెలిసిందే. కేవలం రెండు ఎమ్మెల్యే సీట్లను తప్ప అన్నింటినీ జగన్ పార్టీ సొంతం చేసుకుంది. అంతకు ముందు ఎన్నికల్లో రెండే సీట్లను నెగ్గిన జిల్లాలో రెండింటిని తప్ప అన్ని సీట్లనూ జగన్ పార్టీ సొంతం చేసుకుంది. ఆ స్థాయి విజయాన్ని సాధించిన నేపథ్యంలో మంత్రి పదవుల విషయంలో చాలా మంది ఆశావహులు తయారయ్యారు.
కానీ వారెవరికీ సీఎం జగన్ అవకాశం ఇవ్వలేదు. బీసీ వర్గాలకు ప్రాధాన్యతను ఇవ్వడానికి పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు మాత్రమే అవకాశం ఇచ్చారు. జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నా జగన్ మాత్రం రెండో పదవి ఇవ్వలేదు. దీంతో సహజంగానే అసంతృప్తులు తలెత్తాయి. కానీ బయటకు మాత్రం ఎవ్వరూ పడలేదు.
కానీ తమకు పదవి దక్కలేదు - శంకర్ నారాయణకు దక్కిన వైనం పై మాత్రం నేతలు గుర్రుగా ఉన్నారట. అందుకే వారు ఆయన మీద అసంతృప్తిని చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన జిల్లా స్థాయిలో ఏవైనా కార్యక్రమాలను నిర్వహించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంత ఉత్సాహంతో హాజరుకావడం లేదని తెలుస్తోంది. వాటిని బాయ్ కాట్ చేసినంత పని చేస్తున్నారట వారు.
ఇక ఇదే సమయంలో మంత్రి పనితీరుపై కూడా నెగిటివ్ టాక్ వస్తూ ఉండటం గమనార్హం. ఆయన కూడా జిల్లాను దాటడం లేదట. మంత్రిగా తన పనితీరుతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నా శంకర్ నారాయణ మాత్రం ఎంతసేపటికీ అనంతపురం జిల్లాను - తన నియోజకవర్గాన్నీ దాటడం లేదు అనే అభిప్రాయాలూ వినిపిస్తుండటం గమనార్హం!