Begin typing your search above and press return to search.
కేసీఆర్ 'బీఆర్ఎస్' లాంచ్: అప్పుడే గుజరాత్ లో పోటీకి రెడీ
By: Tupaki Desk | 5 Oct 2022 9:30 AM GMTకేసీఆర్ జాతీయ పార్టీని అలా ప్రకటించాడో లేడో.. ఇలా పోటీకి సై అంటోంది గులాబీ దండు.. ఏకంగా ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ పై కన్నేసింది. దేశంలో రాబోయేది గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగబోతున్నాయి.
ఈ క్రమంలోనే అక్కడ పోటీకి రంగం సిద్ధం చేస్తోంది. తొలుత బీజేపీకి ఆయువుపట్టుగా ఉన్న గుజరాత్ లోనే పోటీ చేయాలని కేసీఆర్ అండ్ టీం రెడీ అవుతోంది.
గుజరాత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీచేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోడీ పోటీచేసిన చోట కూడా మా పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు.
త్వరలో గుజరాత్ లో జరుగనున్న ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ఇప్పటికే అక్కడ ప్రచారం ప్రారంభించాయి. బీఆర్ఎస్ కూడా త్వరలోనే గుజరాత్ లో ప్రచారం ప్రారంభించనుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
దీన్ని బట్టి తొలి ఫైట్ నే కేసీఆర్ ఏకంగా మోడీతో పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక రైతు ఎజెండాగానే కేసీఆర్ జాతీయ పార్టీ అంశాలు ఉండబోతున్నాయి.తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలే జాతీయ అంశాలుగా కాబోతున్నాయి..
రైతులకు ఉచిత కరెంట్, వారి పంట కొనుగోళ్లు, రైతు సమస్యలు తీర్చడం.. పంటకు పెట్టుబడిగా రైతుబంధు, రైతు బీమా లాంటి అంశాలు దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేసీఆర్ నిర్ణయించారు. మరి తెలంగాణలో అధికారం సాధించిన కేసీఆర్.. కేంద్రంలో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడన్నది వేచిచూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.