Begin typing your search above and press return to search.
చిరంజీవి , పవన్ కళ్యాణ్ కి పట్టిన గతే .. షర్మిల కి కూడా పడుతుంది : మంత్రి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యల
By: Tupaki Desk | 13 Feb 2021 3:30 PM GMTతెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె , ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెల్లెలు వై ఎస్ షర్మిల కొత్తగా పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా కొత్త పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించింది. దీనితో పలువురు నేతలు వై ఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల ఇక్క పార్టీ పెట్టినంత మాత్రన తమకు జరిగే నష్టమేమీ లేదని కొట్టిపారేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.
తెలంగాణలో ఇంతకుముందు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ పెట్టిన పార్టీలు ఏమయ్యాయో అందరికి తెలుసని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే పెద్దగా ఒరిగేదేమీ లేదని అన్నారు. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారని, అలాంటిది పరాయి వాళ్లకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వబోరని అన్నారు. ఎవరు ఏ పార్టీ పెట్టినా.. తమకేమీ నష్టం లేదని అన్నారు.
70 ఏళ్ల పాలనలో సంతోషంగా లేని ప్రజలు కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. షర్మిల ఎవరి బాణం కాదని, ఏపీలో ఏం చేయలేక ఇక్కడికి వచ్చారని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. వైఎస్ మరణించి ఆరేళ్లు అయిపోయిందని, పరాయి నేతలు వద్దనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని చెప్పారు.