Begin typing your search above and press return to search.

డ్రైవర్ కు మహమ్మారి.. కారుమారిన మంత్రి

By:  Tupaki Desk   |   27 Jun 2020 9:45 AM IST
డ్రైవర్ కు మహమ్మారి.. కారుమారిన మంత్రి
X
మహమ్మారి మన ఇంటివరకూ వచ్చేసింది. ఇక మనల్ని కబళించడమే తరువాయి అన్నట్టుగా మారింది. తాజాగా తమిళనాడులో మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. ఢిల్లీని మించి కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కారులో ప్రయాణిస్తుండగా.. ఒక బ్రేకింగ్ న్యూస్ తెలిసింది. తన డ్రైవర్ కే మహమ్మారి పాజిటివ్ అని ఫోన్ రావడంతో వెంటనే షాక్ అయ్యాడు. కారును మార్గమధ్యంలోనే ఆపేసి వేరే కారులోకి మారిపోయారు. ఈ ఉదంతం తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలో చోటుచేసుకుంది.

తమిళనాడు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎస్ రామచంద్రన్ తాజాగా సేపూర్ పట్టణంలో పేదలకు సాయం అందించే కార్యక్రమంలో పాల్గొనేందుకు తిరువన్నమలై నుంచి కారులో బయలుదేరారు. మంత్రి కారులో పోతుండగా.. మంత్రి డ్రైవర్ కు మహమ్మారి పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందంటూ మంత్రి పీఏకు ఫోన్ కాల్ వచ్చింది. ఈ హఠాత్ పరిణామానికి వణికిపోయిన మంత్రి వెంటనే తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని కారు దిగిపోయి మరో కారులో ఇంటికి తిరిగి పయనమయ్యారు.

మంత్రి డ్రైవర్ ఒకరోజు ముందే మహమ్మారి పరీక్షకు శాంపిల్ ఇచ్చాడు. మరుసటి రోజు మంత్రితో కలిసి కారును పోనిస్తుండగా ఈ వార్త తెలిసింది. దీంతో మంత్రి మహమ్మారి టెస్టులు చేయించుకొని హోం క్వారంటైన్ కు తరలిపోయాడు. మంత్రి డ్రైవర్ ను అర్బన్ హెల్త్ సెంటర్ కు తరలించారు.