Begin typing your search above and press return to search.
కేటీఆర్ తగ్గినా తలసాని తగ్గట్లేదుగా.. బొత్సకు భారీ పంచ్
By: Tupaki Desk | 30 April 2022 12:30 PM GMTతాను తప్పుడు ఉద్దేశంతో కాకుండా యాధాలాపంగా వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పుకున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. తెలంగాణలో జరిగిన డెవలప్ మెంట్ ను గొప్పగా చెప్పుకునే క్రమంలో.. ఏపీలో ఏమీ లేదన్న మాటను తన స్నేహితుడు తనతో చెప్పారంటూ చెప్పిన కేటీఆర్ మాటలకు ఏపీ అధికారపక్షం ఒక్కసారిగా గొంతు విప్పింది. ఒకరి తర్వాత ఒకరు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రిటార్టు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నోటి నుంచి వచ్చిన మాటలు ఆయనకు గట్టి పంచ్ లు పడేలా చేశాయి.
పక్క రాష్ట్రంలో కరెంటు కోతలు.. నీటి సమస్య.. రోడ్లు ధ్వంసమైన పరిస్థితి ఉందని సంక్రాంతికి ఊరికి వెళ్లి వచ్చిన తన స్నేహితుడు చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తే.. దాన్ని సరైన రీతిలో రియాక్టు అయ్యే విషయంలో ఏపీ అధికారపక్ష నేతలంతా విఫలమయ్యారనే చెప్పాలి. బొత్స సత్యానారాయణ అయితే.. తాను నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చానని.. కరెంటు లేక రెండు రోజులు జనరేటర్ ఆడించినట్లుగా ఆయన చెప్పారు.
బొత్స నోటి నుంచి వచ్చిన మాట మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వచ్చిన కాసేపటికే టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కాస్త దూకుడుగా రియాక్టు అయి.. 'బిల్లు కట్టి ఉండకపోవచ్చు. కరెంటు కనెక్షన్ కట్ చేసి ఉంటారు' అంటూ బొత్స సత్యానారాయణ గాలి తీసేశారు. శుక్రవారం అర్థరాత్రి వేళ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ తో.. అప్పటివరకు హాట్ టాపిక్ గా ఉన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల ఇష్యూ ఒక కొలిక్కి వచ్చినట్లుగా అందరూ భావించారు. కానీ.. అదేమీ కాదన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రియాక్టు అవుతూ మంత్రి బొత్సతో పాటు మరికొందరుచేసిన వ్యాఖ్యలకు హోల్ సేల్ గా కౌంటర్లు ఇచ్చేశారు. ఇదే సమయంలో తన నోటి దూకుడుతో.. ఏపీ నేతలకు దిమ్మ తిరిగిపోయే పంచ్ వేశారు. దీన్ని సరిగా అర్థం చేసుకున్న వారెవరూ కూడా హైదరాబాద్ లో ఫంక్షన్లు పెట్టుకోవటానికి సిగ్గుపడేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
పక్క రాష్ట్రంలో కరెంటు లేదన్న కేటీఆర్ మాటలకు కౌంటర్ గా హైదరాబాద్ లోనే కరెంటు లేదన్న మంత్రి బొత్స వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 'కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ నేతలు ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నారు? హైదరాబాద్ లో కరెంటు లేదనటంలో అర్థం లేదు. కరెంటు లేకుంటే ఇక్కడెందుకు శుభకార్యాలు చేస్తున్నారు? ఏపీ నేతలు తొందరపాటుతో వ్యాఖ్యలు ేస్తున్నారు. కోతలు లేని విద్యుత్.. మౌలిక వసతుల కల్పన వల్లే నగరానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయి' అంటూ తలసాని వివరించారు.
తలసాని మాటలు విన్న తర్వాత సిగ్గు ఉన్న ఏ ఏపీకి చెందిన నేత కూడా హైదరాబాద్ లో తమ ఫంక్షన్లను ఏర్పాటు చేసుకోరంటున్నారు. మొన్నటికి మొన్న మంత్రి బొత్స సత్యానారాయణ కుమారుడి వివాహానికి సంబంధించిన వేడుకను హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహించటం తెలిసిందే. ఆ విషయాన్నే సందర్భానికి తగ్గట్లుగా గుర్తు చేస్తూ ఏపీ అధికారపక్ష నేతల గాలి తీశారు టీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.