Begin typing your search above and press return to search.
ప్రతిపాడులో మంత్రి పర్యటన.. సుచరిత గూటిలో మరిన్ని మంటలు!
By: Tupaki Desk | 13 Dec 2022 11:30 PM GMTగుంటూరు జిల్లాలో కీలకమైన ఎస్సీ నియోజకవర్గం ప్రత్తిపాడు. ఇక్కడ నుంచి మాజీ హొం మంత్రి మేకతో టి సుచరిత.. ప్రాతినిద్యం వహిస్తున్నారు. అయితే, ఇక్కడ మార్పులు జరుగుతాయనే చర్చ కొన్నాళ్లుగా వినిపిస్తోంది. మేకతోటి పార్టీలో ఉన్నప్పటికీ..త నను మంత్రి పదవి నుంచి తొలగించడం పట్ల అసంతృ ప్తితో ఉన్నారని.. పార్టీ కార్యక్రమాలకు కూడా డుమ్మా కొడుతున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విష యం తెలిసిందే.
దీనికితోడు.. గుంటూరు జిల్లా పార్టీ బాధ్యతల నుంచి కూడా తాను తప్పుకొంటున్నట్టు ఇటీవల ప్రకటించా రు. ఈ మేరకు ఆమె పార్టీ అధిష్టానానికి కూడా లేఖ రాశారు. అయితే... దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకముందుగానే.. ఇక్కడ ఒక కీలక మంత్రి, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత.. గత వారంలో రెండుసార్లు పర్యటించారు. అయితే, ఆయన ఎందుకు వచ్చారంటే.. తన వారిని చూసేందుకు వచ్చినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.
కానీ పార్టీ ఆదేశాలతోనే ఆయన ఇక్కడ విజిట్ చేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని మేకతోటి వర్గం కూడా పసిగట్టింది. వచ్చే ఎన్నికల్లో తనను పక్కన పెట్టి సదరు మంత్రికి ఇక్కడ ఛాన్స్ ఇచ్చే వ్యూహం ఉందేమో.. అనే సందేహాలు మేకతోటి గూటి నుంచి జోరుగానే వినిపిస్తున్నాయి.
అయితే, దీనిపై పార్టీ ఎలాంటి సూచనలు చేయకపోవడం.. మేకతోటికి ప్రాధాన్యం ఇస్తారా? ఇవ్వరా? అనేది కూడా తేల్చకపోవడం మరింత వివాదానికి దారితీసింది. ఏదేమైనా.. తాజాగా మంత్రి పర్యటన మాత్రం మేకతోటి వర్గంలో సెగలను మరింత పెంచుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.