Begin typing your search above and press return to search.

పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి?

By:  Tupaki Desk   |   26 April 2021 2:30 AM GMT
పార్టీ మారిన టీడీపీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి?
X
తెలంగాణలో మళ్లీ కేబినెట్ కలలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ అధిష్టానం టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన సండ్ర వెంకటవీరయ్యకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ అయ్యిందని.. ఆయన తెలుగుదేశం ఏకైక ఎమ్మెల్యేను టీఆర్ఎస్ పార్టీలో చేర్చడంతో సండ్రకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం మొదలైంది.

కేసీఆర్ అప్పగించిన టీడీఎల్పీ విలీనాన్ని టీఆర్ఎస్ లో సండ్ర చేయడంతో ఇక ఆయనకు మంత్రి పదవి త్వరలోనే ఇవ్వబోతున్నారనే చర్చ సాగుతోంది.

తెలుగుదేశం ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసిన తర్వాత మళ్లీ కేబినెట్ పునర్వ్యస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొందరికి ఉద్వాసన పలికి కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న పుకార్లు సాగుతున్నాయి.

ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంత్రివర్గంలోకి రాబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కేసీఆర్ ఈ మేరకు గతంలోనే సండ్రకు హామీనిచ్చారని.. టీడీఎల్పీ విలీనం తర్వాత సండ్రను క్యాబినేట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది.

ప్రస్తుతం ఖమ్మం జిల్లా నేతల్లో సండ్ర వెంకటవీరయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచే వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. అంతకుముందు సీపీఎం నుంచి ఒకసారి గెలిచారు. వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న సండ్రను కేబినెట్ లో ఈసారి చోటు దక్కుతుందని అంటున్నారు.