Begin typing your search above and press return to search.

మంత్రుల‌ను ఆక‌ర్షించిన అఖండ‌!

By:  Tupaki Desk   |   18 Dec 2021 8:51 AM GMT
మంత్రుల‌ను ఆక‌ర్షించిన అఖండ‌!
X
అఖండ‌.. నంద‌మూరి బాల‌కృష్ణ ద్విపాత్రాభినంలో వ‌చ్చిన లేటెస్ట్ మూవీ. చిన్నా పెద్దా.. అంద‌రినా.. క్లాస్ మాస్‌నీ.. క‌ట్ట‌గ‌ట్టి ఆకర్షించిన సినిమా ఇది! ఇటీవ‌ల కాలంలో అతిపెద్ద క‌లెక్ష‌న్ రాబ‌ట్టిన మూవీగా కూడా రికార్డు సృష్టించింది. అయితే.. ఈ సినిమా.. వైసీపీ నేత‌ల‌ను కూడా ఆక‌ర్షించ‌డం గ‌మ‌నార్హం.

అదేంటి? వారు మాత్రం మ‌నుషులు కాదా.. వారికి మాత్రం సినిమాలు చూడాల‌ని ఉండ‌దా? అంటే.. ఉంటుంది! వారు కూడా చూడొచ్చు. కానీ.. ఇది.. వైసీపీ విష‌యానికి వ‌స్తే.. మామూలు సినిమా కాదు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు న‌టించిన సినిమా!

అంతేకాదు.. టీడీపీ ఎమ్మెల్యే న‌టించిన సినిమా!! అందుకే.. ఇప్పుడు ఈ అఖండ మూవీని వైసీపీ మంత్రు లు వీక్షించ‌డం.. చ‌ర్చ‌నీయాంశం.. అంత‌కు మించి ఆస‌క్తిగాను మారింది. ఎందుకంటే.. టీడీపీ పొడ అంటేనే వైసీపీకి గిట్ట‌దు.

టీడీపీ మాట అంటేనే కంప‌రం ఎత్తిపోతుంది! మ‌రి అలాంటి పార్టీకి చెందిన నాయ‌కుడు.. అలాంటి పార్టీ అధినేత వియ్యంకుడు.. న‌టించిన సినిమాకు వెళ్ల‌డం.. బాగుంద‌ని.. మంత్రుల మ‌ధ్యే చ‌ర్చించుకోవ‌డం అంటే.. ఆసక్తిగా లేదూ! నిజానికి ఇప్పుడు ఏపీలో సినిమా టికెట్ల వివాదం తార‌స్థాయిలో ఉంది.

అయిన‌ప్ప‌టికీ.. మంత్రులు.. హుటాహుటిన హైద‌రాబాద్ వెళ్లి.. అఖండ మూవీని వీక్షించారు. అంతేకాదు.. ఈ సినిమా బాగుంద‌ని.. అంత‌ర్గ‌తంగా కూడా చ‌ర్చించుకుంటున్నారు. మ‌రికొంద‌రు ``మీరూ చూడండి!`` అంటూ.. ఇంకొంద‌రికి స‌ల‌హా కూడా ఇస్తున్నార‌ట‌.

ఇదిలావుంటే.. వైసీపీలోని సినిమా ప్రియులైన కొందరు మంత్రులు.. అఖండ డైలాగుల‌ను ప‌దే ప‌దే నెమ‌రు వేసుకుంటున్నార‌ట‌. సినిమా అంటే.. అంతే! మ‌నం కొన్ని కొన్ని చూసీ చూడ‌న‌ట్టు పోవాల్సిందే!`` అని వ్యాఖ్యానిస్తున్నార‌ట‌. మొత్తానికి బాల‌య్య‌ అఖండ వైసీపీ మంత్రుల‌ను తెగ ఆక‌ర్షించ‌డం గ‌మ‌నార్హం.