Begin typing your search above and press return to search.
ఐటీడీపీ వాళ్ల దెబ్బకు మంత్రులు ఇబ్బంది పడుతున్నారా ?
By: Tupaki Desk | 4 Dec 2021 2:37 PM GMTమాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతలకాయల విజయ్ ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఆ పార్టీ వింగ్ సోషల్ మీడియాలో దూకుడుగా ముందుకు వెళుతోంది. అయ్యన్న పాత్రుడుతో పాటు టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ( ప్రశాంత్ కిషోర్ శిష్యుడు) ఆధ్వర్యంలో 500 మందితో ఈ విభాగం స్ట్రాంగ్‌గా పని చేస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన అరాచకాలు, మంత్రులు, ప్రభుత్వ లోపాలను వీళ్లు చాలా సెటిరికల్‌గా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వీరంతా జీతాలకు పని చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రతి రోజు వచ్చే వార్తల మీద రీసెర్చ్ చేస్తూ వాటికి కౌంటర్లుగా సోషల్ మీడియాలో ఏం చేస్తే జనాల్లోకి బాగా వెళుతుందో రీసెర్చ్ చేసి మరి వైసీపీని టార్గెట్ చేస్తున్నట్టుగా కనపడుతోంది.
ఇక విజయ్ ముందుగా రాష్ట్ర ఐ టీడీపీ అధ్యక్షుడు అయ్యాక పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కూడా ఐ టీడీపీ అధ్యక్షులను నియమించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఐ టీడీపీ కమిటీలను వేశారు. ఇవన్నీ ఇప్పుడు చాలా యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. ప్రతి మండలానికి కూడా ఓ ఐటీడీపీ కార్యకర్తను పెట్టి వాళ్ల అఫీఫియల్ అక్కౌట్లతోనే ఈ వ్యవహారం నడిపిస్తున్నారట. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక విషయాలు బాగా హైలెట్ అవుతాయి. ఇప్పుడు ఐ టీడీపీ కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ వ్యతిరేక వ్యవహారాలను హైలెట్ చేసేందుకు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న మిగిలిన ప్రతిపక్షాల విషయానలు కూడా వాడుకుంటోంది.
2019 ఎన్నికలకు ముందు కూడా వైసీపీ సోషల్ మీడియా వింగ్ నాడు అధికారంలో ఉన్న టీడీపీని టార్గెట్ చేస్తే టీడీపీ తట్టుకోలేక చేతులు ఎత్తేసిన పరిస్థితి. అయితే అప్పుడు పీకే టీం బలంగా ఉండడంతో ఆ క్రెడిట్ అంతా పీకే టీంకు వెళ్లిపోయింది. నాడు వైసీపీ వాళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో ఆ పార్టీకి చాలా మంది కసితో వలంటీర్‌గా పనిచేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. అయితే ఇప్పుడు ఐ టీడీపీ వింగ్ కూడా చాలా నిర్మాణాత్మకంగా పనిచేస్తోన్న పరిస్థితి ఉంది. మంత్రులకు సంబంధించి ప్రతి వ్యతిరేక వార్తను కూడా వ్యూహాత్మకంగా ట్రోల్ చేస్తూ వస్తోంది.
తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రెండేళ్లకు పోలవరం ప్రాజెక్టు కడతాం అన్న మాటలు ఇప్పుడు బయటకు తీసి ఐ టీడీపీ మామూలుగా ట్రోల్ చేయలేదు. అది తట్టుకోలేక మంత్రి అనిల్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ టీడీపీ వాళ్లపై తీవ్ర అసహనం చూపించే వరకు వెళ్లారు. దీనిని బట్టే ఐ టీడీపీ ఎలా పని చేస్తుందో తెలుస్తోంది. ఇప్పటకి అయినా వైసీపీ సోషల్ మీడియా మేల్కోక పోతే ఐటీడీపీ దెబ్బకు వైసీపీ వచ్చే సాధారణ ఎన్నికల్లో ఇబ్బంది పడక తప్పదు.