Begin typing your search above and press return to search.

మంత్రుల ఆఫీసు.. ఇళ్ల నుంచి 11కి.మీ.

By:  Tupaki Desk   |   28 Dec 2015 5:02 AM GMT
మంత్రుల ఆఫీసు.. ఇళ్ల నుంచి 11కి.మీ.
X
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థుల్లో జూన్ నాటికి ఏపీ రాజధాని అమరావతికి సచివాలయాన్ని తరలించాలన్న ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. సచివాలయాన్ని తరలిస్తే.. తమ కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటు చేస్తారంటూ ఉద్యోగ సంఘాల వారుప్రశ్నల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే పలు వాదనలు వినిపించాయి. గన్నవరం దగ్గరే ఉన్న మేధా టవర్స్ అన్న మాటలు వినిపించాయి.

అయితే.. ఈ వాదనలకు తెర దించుతూ తాజాగా ఏపీ సర్కారు విస్పష్ట నిర్ణయం తీసుకుంది. ఏపీ సచివాలయాన్ని అమరావతిలోనే నిర్మించాలని డిసైడ్ చేశారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అమరావతిలోని టౌన్ షిప్ లో రెండంతస్తుల ఫ్యాబ్రికేటెడ్ సచివాలయ నిర్మాణం చేయాలని నిర్ణయించింది. 6 లక్షల చదరపు గజాల విస్తీర్ణంలో సచివాలయ భవనాల్ని నిర్మించనున్నారు. వాస్తవానికి ఈ ఎంపిక ముందు మేధా టవర్స్ ను ఓకే చేసినప్పటికీ.. సాంకేతిక కారణాలతో మేధా టవర్స్ ఎంపిక విషయంలో సర్కారు వెనక్కి తగ్గింది.

తాజాగా అమరావతి టౌన్ షిప్ లోనే సచివాలయాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి వచ్చే నాటికి వీటిని సిద్ధం చేయాలన్న నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇక.. తాజాగా నిర్ణయించిన దాని ప్రకారం.. అమరావతి టౌన్ షిప్ లో ఏర్పాటు చేసే సచివాలయానికి.. మంత్రులు ప్రస్తుతం ఉంటున్న రెయిన్ ట్రీ పార్కుకు మధ్య 11 కిలోమీటర్ల దూరం ఉండనుంది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కులో ఉన్న సుమారు 236 ప్లాట్లు.. 21 విల్లాలను ఏపీ సర్కారు రెండేళ్ల పాటు అద్దెకు తీసుకున్న సంగతి తెలిసిందే. అమరావతి పూర్తి స్థాయ నిర్మాణం పూర్తి అయిన తర్వాత.. మంత్రులు అక్కడకు షిఫ్ట్ కానున్నారు.