Begin typing your search above and press return to search.
జగన్ ఆదేశాలకు భిన్నంగా ఆయన మంత్రులు!
By: Tupaki Desk | 21 Jun 2019 4:35 AM GMTతన పార్టీ వాళ్లకు జగన్ మోహన్ రెడ్డి ఏ అంశంలోనూ ఇప్పటి వరకూ అంత గట్టిగా ఆదేశాలు జారీ చేసిన అంశాలేమీ లేవు. కేవలం మంత్రులకు మాత్రం ఒక సర్క్యులర్ జారీ చేశారు. తెలుగుదేశం హయాంలో సెక్రటేరియట్ లో, మంత్రుల పేషీల్లో కీలక పాత్రల్లో చక్రం తిప్పిన వారిని సాగనంపాలని మాత్రం జగన్ ఆదేశించారు.
ఆ మేరకు తన మంత్రులకు సర్క్యులర్ ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి. టీడీపీ హయాంలో మంత్రులుగా ఉన్న వాళ్లను అలాగే కొనసాగిస్తే వాళ్లు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పాత అజెండాలనే కొనసాగించే అవకాశాలున్నాయని, తెలుగుదేశం విధానాలను గట్టిగా వ్యతిరేకించిన నేపథ్యంలో పాత వాళ్లను సాగనంపాలని జగన్ మోహన్ రెడ్డి తన మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ మేరకు చాలా మంది ఆ ఆదేశాలను పాటించారు కానీ.. ఒకరిద్దరు మాత్రం తెలుగుదేశం కాలంలో మంత్రులు పీఏలుగా వ్యవహరించిన వారినే ఇప్పటికీ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. వారిలో ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, మరొక మంత్రి వర్యులు ఉండటం గమనార్హం.
చంద్రబాబు హయాంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పీఏగా వ్యవహరించిన వ్యక్తినే డిప్యూటీ ముఖ్యమంత్రి ఒకరు తన పీఏగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ డిప్యూటీ సీఎంతో పాటు మరో మంత్రి కూడా ఇదే తీరున గత మంత్రి ఒకరికి పీఏగా వ్యవహరించిన వ్యక్తినే నియమించుకున్నట్టుగా తెలుస్తోంది.