Begin typing your search above and press return to search.
వెలగపూడిపై మంత్రులు చిన్నచూపు
By: Tupaki Desk | 27 Dec 2016 7:38 AM GMTవెలగపూడిలోని అంధ్రప్రదేశ్ సచివాలయంలోన ఉన్న మంత్రుల ఛాంబర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. విజయవాడలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిరోజూ సచివాలయానికి వస్తున్నారు కానీ మంత్రులు మాత్రం అటువైపు రావడం లేదు. వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చే సందర్శకులకు మంత్రులు అందుబాటులో ఉండాలని భావించి, ప్రతి శుక్రవారం సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులను చంద్రబాబు గతంలోనే ఆదేశించారు. కానీ, ఆయన మాట పట్టించుకున్న మంత్రులే లేరు. అందరికీ ఛాంబర్లు కేటాయించినప్పటికీ శుక్రవారం అరకొరగా మాత్రమే మంత్రులు వస్తున్నారు. మంత్రివర్గ ఉప సంఘ సమావేశాలు - ఇతర సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే శుక్రవారం వస్తున్నారు. దీంతో మంత్రులు ఎప్పుడు వస్తారో తెలియక సందర్శకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వస్తారని ఎదురుచూసి వెనుదిరగాల్సి వస్తోంది. సచివాలయానికి మంత్రులు ఎప్పుడు వస్తారో తెలియకపోవడంతోపాటు విభాగాధిపతుల కార్యాలయాలు పలు ప్రాంతాల్లో ఉండటం కూడా సందర్శకులను ఇక్కట్లకు గురిచేస్తోంది.
ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వారంలో రెండ్రోజులు సచివాలయంలో మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమ - శుక్రవారాల్లో మంత్రులు వెలగపూడిలో ఉండాలన్నారు. ఆయన ఆదేశించిన తరువాత తొలి సోమవారం యనమల - నారాయణ - గంటా - పత్తిపాటి పుల్లారావు - రాఘవరావు - మృణాళిని - కామినేని మాత్రమే వచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు అందరూ అందుబాటులో ఉంటారని వచ్చిన సందర్శకులు ఇబ్బందులకు గురయ్యారు. సోమ - శుక్రవారాల్లో మంత్రులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ కొందరు మంత్రులు మాత్రం గురు - శుక్రవారాల్లో ఉంటామని.. సోమవారం తమకు వీలుకాదని చెబుతున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/