Begin typing your search above and press return to search.
ఏడాదే మంత్రులట...ఇదే లెక్కట...?
By: Tupaki Desk | 1 April 2022 9:30 AM GMTఏపీలో మంత్రివర్గ విస్తరణ కాదు కానీ ఉన్న మంత్రులు మాత్రం స్థిమితంగా ఉండలేకపోతున్నారు. వారిలో తీవ్రమైన అసంతృప్తి ఉంది అంటున్నారు. తమను తప్పించేసి కొత్త వారిని తీసుకోవడం ఏమీ బాగాలేదన్నది చాలా మందిలో ఉంది. తాము ఉన్న దాంట్లో సమర్ధంగానే చేశామని అంటున్నారు. నిజానికి ఇపుడు మంత్రి వర్గ విస్తరణ పేరిట ఉన్న వారిని అందరినీ తప్పించడం మీద కూడా చర్చ సాగుతోంది.
ఏపీలో కానీ దేశంలో కానీ అరుదైన సందర్భాలలో తప్ప ఇలా ఎపుడూ జరిగింది లేదు అంటున్నారు. అప్పట్లో అంటే 1989లో ఎన్టీయార్ ఒక్క వేటుతో మొత్తానికి మొత్తం మంత్రులను తప్పించేశారు. వారి ప్లేస్ లో కొత్త వారిని మొత్తంగా తీసుకున్నారు. అయితే అదే ఏడాది చివరలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఎన్టీయార్ నాయకత్వాన ఫస్ట్ టైం ఓడిపోయింది.
అయితే ఎన్టీయర్ నిర్ణయం తప్పు అని నాడు పార్టీలో చర్చ జరిగింది. ఇప్పటికీ దాని మీద ఏదో సందర్భంలో రాజకీయ పార్టీలలో చర్చిస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న మంత్రులు తాము పదవిని అధినాయకత్వం చెబుతున్నట్లుగా 34 నెలల పూర్తి కాలం అనుభవించలేకపోయామని అంటున్నారు. ఏకంగా రెండేళ్ల పాటు అంటే 24 నెలలు కరోనాతోనే పుణ్య కాలం అంతా గడచిపోయింది అని గుర్తు చేస్తున్నారు. అంటే తాము మంత్రులుగా ఎలా చూసుకున్నా గట్టిగా ఏడాదికి అటు ఇటుగా మాత్రమే పవర్ చలాయించినట్లు అని వారు విశ్లేషిస్తున్నారు.
ఇక మరో విషయం కూడా చర్చకు వస్తోంది. మంత్రి పదవుల విస్తరణ అన్నది ఎపుడు చేసిన మొత్తానికి మొత్తం తొలగించరు. విస్తరణ పేరిట అరడజన్ మందిని, వీలైతే మరికొందరినీ తీసుకుంటారు. అది కూడా ఉన్న వారి పనితీరు మీద అసంతృప్తి ఉన్నా. అలాగే వారి మీద ఏమైనా అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా మంత్రి వర్గం నుంచి తొలగిస్తారు.
కానీ ఇపుడున్న వారి మీద అలాంటి ఆరోపణలు అన్నవి అసలు లేవు. అయితే ఇక్కడ ఒకే ఒక విషయం ఉంది. అది జగన్ నాడు ఇచ్చిన మాట. సగం పాలన పూర్తి అయ్యాక తొంబై శాతం మందిని తొలగించి మిగిలిన వారికి అవకాశం ఇస్తాను అని చెప్పడం. ఇపుడు ఆ హామీని నెరవేర్చడానికే ఈ విస్తరణ అంటున్నారు.
మరో వైపు చూస్తే ప్రస్తుత క్యాబినేట్లో కొందరు తప్ప మిగిలిన వారు అంతా బాగానే పనిచేస్తున్నారు. తమ శాఖల మీద వారికి పట్టుంది. వారు కూడా తమ పరిధిలో పూర్తి శక్తిని ఉపయోగించి పనిచేస్తున్నారు. అందుకే వారు తాము మాజీలు అవుతున్నదుకు బాధపడుతున్నారు అని టాక్.
ఇక మంత్రి వర్గ విస్తరణ అంటే తేనెతుట్టెను కదిలించినట్లే. ఉన్న వారిని ఏ కొందరిని తొలగించినా అసంతృప్తి వస్తుంది. అలాంటిది తొంబై శాతం అంటే చాలా మందిలో అది ఉంటుంది. ఇక కొత్తగా ఎంతమందిని తీసుకున్నా కూడా గట్టిగా 20 మందికి మించి చాన్స్ రాదు. మరి మిగిలిన వారి సంగతేటి. ఇపుడు మాజీలైన వారు కూడా అసమ్మతి రాగాలాపన చేస్తే పరిస్థితి ఏంటి. ఇవన్నీ వైసీపీలో జరుగుతున్న చర్చ.
మొత్తానికి ప్రస్తుత మంత్రులకు పార్టీ పదవులు ఇస్తామని, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి వస్తే మళ్లీ వారే మంత్రులు అంటూ జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ అయితే చాలా మందికి మాత్రం హ్యాపీగా లేదని అర్ధమవుతోంది. పైకి మాత్రం మంత్రి పదవులు పోయినా పరవాలేదు అని అంటున్నా తాము గట్టిగా ఏడాది కూడా పవర్ చూపించకుండానే మాజీలమయ్యామన్న బాధ అయితే వారిలో ఉంది అంటున్నారు.